Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణాకు కేంద్రం ఊహించని గిఫ్ట్.. ఏకంగా 424 కోట్ల రూపాయలు!

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్రం నుంచి తెలంగాణాకు ఊహించని భారీ ప్రోత్సాహకం లభించింది. ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను నిర్దేశించిన లక్ష్య సమయానికి పూర్తిచేసినందుకు రాష్ట్రానికి రూ.424 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. అయితే వాటిలో తెలంగాణ ముందంజలో నిలిచింది.

ఫార్మర్ రిజిస్ట్రీ తో రైతుల పూర్తి డేటా బేస్

వ్యవసాయ రంగంలో పారదర్శకత, రైతుల వివరాల సమగ్ర నమోదును వేగవంతంగా పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఫార్మర్‌ రిజిస్ట్రీ అనేది రైతులకు సంబంధించిన సమగ్ర రిజిస్టర్. రైతుల భూమి, పంటలు, పంట బీమా, సబ్సిడీలు, ఇతర సంక్షేమ పథకాల వివరాలను సమగ్రంగా నమోదు చేసే వ్యవస్థ. ఈ డేటాబేస్‌ ద్వారా రైతులకు నేరుగా లభ్ది చేకూరేలా చర్యలు తీసుకోవడం సులభమవుతుంది.

Central Govt said good news to telangana incentive of Rs 424 crores for completing farmers registry

కేంద్రం ప్రోత్సాహక నిధులు

అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు మరింత పారదర్శకంగా రైతులకు అందించటానికి ఇది దోహదం చేస్తుంది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహక నిధులు అందజేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం నుండి ప్రత్యేక ప్రోత్సాహకం సాధించటంలో కీలకంగా పని చేసిన అధికారులను అభినందించారు.

పరిపాలనా సామర్ధ్యాన్ని నిరూపించుకున్న తెలంగాణా

లక్ష్యాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేయడం ద్వారా తెలంగాణ మరోసారి తన పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.రాష్ట్రంలో రైతుల వివరాల నమోదు ప్రక్రియను గ్రామస్థాయి నుంచి సమగ్రంగా నిర్వహించారని, సాంకేతిక వనరులను వినియోగించి డేటా సేకరణను వేగవంతం చేశారని తెలిపారు.

రైతు సంక్షేమం కోసం తెలంగాణా చర్యలకు ఇది మరో గుర్తింపు

ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తికావడంతో భవిష్యత్తులో రైతులకు అందే సబ్సిడీలు, ఆర్థిక సహాయం, బీమా పరిహారాలు మరింత వేగంగా చేరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రోత్సాహక నిధులు వ్యవసాయ రంగ అభివృద్ధికి, డిజిటల్‌ మౌలిక సదుపాయాల బలోపేతానికి వినియోగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతు సంక్షేమం దిశగా తెలంగాణ తీసుకుంటున్న చర్యలకు ఇది మరో గుర్తింపుగా భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+