తెలంగాణా ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. రూ.564 కోట్ల నిధులు విడుదల!
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిధులు విడుదల చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 564 కోట్ల రూపాయల మొత్తాన్ని మంజూరు చేయడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో రాష్ట్రంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే ఎంతోమంది లబ్ధిదారులకు ఇది శుభవార్త గా మారింది.
నిధుల విడుదల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలలో వేగం
గతంలో నిధుల కొరత వల్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక ఆ నిర్మాణాలను తిరిగి ప్రారంభించడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ నిధుల విడుదల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.

తాజాగా 564 కోట్ల రూపాయల విడుదల
తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఈ నిధుల కోసం ఇటీవల ఢిల్లీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులను కలిసి, పెండింగ్లో ఉన్న నిధులను త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక తెలంగాణ అధికారుల విజ్ఞప్తి తో సానుకూలంగా స్పందించిన కేంద్రం త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట మేరకు తాజాగా 564 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన ఇండ్లు
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1.45 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడానికి ప్రణాళికను రూపొందించగా, ఇప్పటివరకు 60 వేల ఇళ్ళను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదనంగా సుమారు 30 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగా అవి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన ఇళ్ళు నిర్మాణ దశలోనే ఉండి నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనల విస్మరణ
ఇప్పుడు కేంద్రం నిధులను విడుదల చేయడంతో ఈ ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసి సొంత ఇల్లు, సొంత స్థలం లేని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు పొందడం కోసం లబ్ధిదారుల పేర్లు, పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టులో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని నిబంధనలను విస్మరించింది.
కాంగ్రెస్ నిబంధనలు పాటించటంతో నిధులు విడుదల
ఇల్లు నిర్మించి, పంపిణీ కూడా చేసిన తర్వాత లబ్ధిదారుల వివరాలను సమర్పించడంతో కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చెయ్యలేదు. అయితే ముందుగానే పోర్టల్ లో అప్ లోడ్ చేసిన తర్వాత కేంద్రం నిధులు ఇస్తుంది కాబట్టి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధన ప్రకారమే కేంద్ర పోర్టల్ లో అప్లోడ్ చేసింది. దీంతో కేంద్రం నిధులను విడుదల చేయనుంది.












Click it and Unblock the Notifications