తెలంగాణలో మరో 4 వరుసల జాతీయ రహదారి.. ఇక దూసుకెళ్లొచ్చు..
తెలంగాణలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచ్చిస్తోంది. రాష్ట్రంలోని రహదారులను విస్తరించేందుకు అటు కేంద్రం సైతం అండగా నిలుస్తోంది. తాజాగా తెలంగాణలో మరో జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం వరంగల్ మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీలను నియమించనున్నారు అధికారులు. ఇందుకోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా నిర్మించాలని, అదనంగా సర్వీస్ రోడ్డును రెండు వరుసలకు పెంచాలని కేంద్ర మంత్రి గడ్కరీని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే.
తెలంగాణలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే దిశగా రాష్ట్రంలో మొత్తం 15 రహదారి ప్రాజెక్టులపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఖమ్మం వరంగల్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ మేరకు డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీలను నియమించనున్నారు అధికారులు. ఇందుకోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆగష్టు 15న కేంద్రం నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్ లో ఎన్ హెచ్- 65 విస్తరణను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారికి త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక జాతీయ రహదారి-563 నిర్మాణంలో భాగంగా ఖమ్మం వరంగల్ మధ్య నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీల నియామకం కోసం కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖ టెండ్లరు ఆహ్వానిస్తోంది. ఈ మార్గంలో ఇరుకుగా ఉన్న రోడ్ల కారణంగా వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిని మొత్తం 119 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు.












Click it and Unblock the Notifications