ఆ న్యూస్ ఫేక్, తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశమే లేదు!
తెలంగాణ రాష్ట్రానికి భూకంప ప్రమాదం పొంచివుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(NGRI) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా భూకంపం వస్తుందని.. అది హైదరాబాద్ నగరంతోపాటు ఏపీలోని అమరావతి వరకు ప్రభావం చూపిస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త ఖండించారు.
తెలుగు రాష్ట్రాల్లో రామగుండం కేంద్రంగా భూకంపం వస్తుందనేది అవాస్తవమని, ఎపిక్ (EPIC) లాంటి సంస్థ ఎన్జీఆర్ఐని అప్రోచ్ కాలేదన్నారు. అది సైంటిఫిక్‌గా ప్రామాణికం కాదని సైంటిస్ట్ శశిధర్ స్పష్టం చేశారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని.. ఎవరూ ఎలాంటి భయానికి గురికావద్దని స్పష్టం చేశారు. ఖచ్చితంగా భూకంపం ఇదే సమయంలో వస్తుందని ఎవరూ చెప్పలేరని.. మన దగ్గర అలాంటి టెక్నాలజీ లేదన్నారు.

భూకంపాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారని.. రామగుండం దగ్గర ఇప్పుడు భూకంపం సంకేతాలు ఏమీలేవని చెప్పారు. భూకంపం వస్తుందంటూ వస్తున్న తప్పుడు వార్తలు నమ్మొద్దన్నారు. ఏమైనా సమాచారం ఉంటే ప్రభుత్వం లేదా ఎన్జీఆర్ఐ లేదా జాతీయ రీసెర్చ్ సంస్థలు వెల్లడిస్తాయన్నారు. అప్పటి వరకు ఎలాంటి వార్తలను నమ్మవద్దని శాస్త్రవేత్త శశిధర పేర్కొన్నారు.
భూకంపం వస్తుందంటూ గత రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. ప్రజలు ఎవరూ ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు అధికారిక చెబితే తప్ప ఏదీ నమ్మవద్దన్నారు. తెలుగు రాష్ట్రాలు జోన్ 2, జోన్ 3లో ఉంటాయని తెలిపారు.
రామగుండం, గోదావరి పరివాహక ప్రాంతంలో జోన్ 3గా ఉందని, ఇక్కడ భూకంపం సంభవించే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏవీలేవన్నారు. తెలంగాణ ప్రాంతం ఎర్త్ ప్లేట్ బౌండరికి దూరంగా ఉండటం వల్ల భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్ట్ శశిధర్ స్పష్టం చేశారు.
-
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications