రాష్ట్రపతికి గవర్నర్ విందు: కెసిఆర్, చంద్రబాబు ఏకాంత చర్చలు, చిరునవ్వుతో పలకరింపులు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజభవన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సతీసమేతంగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. కెసిఆర్ చాలా ముదుగానే వచ్చి, వరుసగా అందరినీ పలకరిస్తూ కరచాలనం చేస్తూ ఉల్లాసంగా కనిపించారు.
సికింద్రాబాదులో బొల్లారం రాష్ట్రపతి భవన్ నుంచి ప్రణబ్ ముఖర్జీ బయలుదేరడానికి ముందు గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, చంద్రబాబులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కెసిఆర్, చంద్రబాబు ప్రత్యేకంగా లోనికి వెళ్లారు. ఇరువురు ముఖ్యమంత్రులతో కలిసి గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి నరసింహన్‌కు స్వాగతం పలికారు.

రాష్ట్రపతి గౌరవర్థాం మంగళవారం రాత్రి గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, చంద్రబాబు నాయుడు చిరునవ్వులతో పలకరించుకున్నారు. ఇరువురు ముచ్చట్లు కూాడా పెట్టారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు 15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.
కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావులతో కెసిఆర్ కరచాలనం చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ మంత్రి హరీష్ రావు లోనికి కలిసి వచ్చారు. ఉల్లాసంగా మాట్లాడుకుంటూ వాళ్లు లోనికి వచ్చారు. ఒక సందర్భంలో ఇరువురు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి ముందుకు నడిచారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చాలా ముందుగా రాజభవన్ చేరుకున్నారు. కాంగ్రెసు నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, బిజెపి నాయకుడు లక్ష్మణ్, ప్రముఖులు బి నర్సింగరావు, ఆవుల మంజులత, వకుళాభరణం రామకృష్ణ వంటి ప్రముఖులు కూడా విందుకు హాజరయ్యారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ కూడా విందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, చినరాజప్ప, నారాయణ తదితరులు కూడా హాజరయ్యారు. సిపిఐ నాయకుడు నారాయణ కూడా వచ్చారు.
రాష్ట్రపతికి ఇచ్చిన విందులో ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధం చేశారు. షోర్బా ఈ ఖుర్మా, మువన్ కాయ్, రసా వడా, టుర్ష్ ఈ పన్నీర్, మామిడికాయ పప్పు, గంగవాయిలి కూర, అరప్పు వడాయి వంటి వంటకాలను ఏర్పాటు చేశారు. విందుకు గవర్నర్ 120 మందిని ఆహ్వనించారు.
-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications