తెలంగాణాపై చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్రలు మొదలయ్యాయి; ఆధారాలివే!!
చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోడీకి చెప్పానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడలేదని వారు అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడని, ఆయన తెలంగాణ సీఎంగా ఉన్నారే కానీ, తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేరని వారు ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఏపీలో కలపటంపై తెలంగాణా బంద్
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపటం పై తెలంగాణ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది అని మాజీ ఎమ్మెల్యేలు వెల్లడించారు. పార్లమెంట్లో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రకు వెళ్లిందని, బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో కొట్లాడారని వారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా నియమించుకున్నారని వారు ఆరోపించారు.

చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత తెలంగాణపై చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని బాల్క సుమన్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకల పాడు పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా రేవంత్ రెడ్డి కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలి
ఏపీకి పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కెసిఆర్ పైన కమిషన్లు వేస్తూ కాంగ్రెస్ మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలలో భాగంగా ఇస్తామని చెప్పిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఐటిఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సివిల్ సప్లైస్ భవన్ ను ముట్టడిస్తాం : పెద్ది సుదర్శన్ రెడ్డి
బిజెపి పైన ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ సివిల్ సప్లైస్ లో జరిగిన కుంభకోణం పై ప్రభుత్వం స్పందించాలని, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లైస్ కుంభకోణం లో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించిన పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరలోనే సివిల్ సప్లైస్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications