అకున్ ‘బాహుబలి3’, డ్రగ్స్ కేసుపై వర్మ సంచలనం: చంద్రవదన్ స్ట్రాంగ్ వార్నింగ్
డ్రగ్స్ కేసు విచారణపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ స్పందించారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ తీవ్రస్థాయిలో స్పందించారు. వర్మ పేరు ప్రస్తావించకుండానే ఆయన సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. సినీ రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాము ఎలాంటి పక్షం పాతం లేకుండా అన్నికోణాల్లో ఆలోచించి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

వర్మ సంచలనం
పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తదితరులకు నోటీసులు ఇచ్చి విచారించినట్లు స్కూల్ పిల్లలను కూడా 12గంటలపాటు విచారించగలరా? అని వర్మ ఎక్సైజ్ శాఖను ప్రశ్నించారు. డ్రగ్స్ ఏమైనా కొత్త విషయా? అని అన్నారు. అంతేగాక, సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ఎక్సైజ్ శాఖ ప్రచారం పొందుతోందని, ఆ శాఖ అంటే ఇప్పటికీ ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు.
Recommended Video


అకున్‌తో రాజమౌళి బాహుబలి3 అంటూ..
డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ అధికారి అకున్ సబర్వాన్‌ను మీడియా అమరేంద్ర బాహుబలి రేంజిలో ప్రచారం కల్పిస్తోందని వర్మ అన్నారు. అంతేగాక, ఎస్ఎస్ రాజమౌళి.. అకున్ సబర్వాల్‌తో బాహుబలి3 చేయొచ్చు అంటూ సెటైర్లు వేశారు. దీంతో పలువురు నెటిజన్లు కూడా వర్మపై ఫైర్ అయ్యారు. డ్రగ్స్ తీసుకున్న సినీ ప్రముఖులను వదిలేయమని చెబుతున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంటల్లోనే తగ్గారు, కానీ..
డ్రగ్స్ కేసు విచారిస్తున్న అకున్ సబర్వాల్ చిత్తశుద్ధిని, ఎక్సైజ్ శాఖ పనితీరును తాను శంకించడం లేదని మరోసారి తన ఫేస్‌బుక్ స్పందించారు. అయితే, మీడియాకు వస్తున్న లీకేజీలపై తాను తప్పుపడుతున్నట్లు చెప్పారు. దీని వల్ల పలువురు సినీ ప్రముఖుల జీవితాలు నాశనమవుతాయని అన్నారు. దీని బాధ్యత సబర్వాల్ దేనని అన్నారు. కాగా, మొదటి పోస్టుకు గంటల్లోనే మాట మారుస్తూ వర్మ మరో పోస్టు పెట్డడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ తీవ్రంగా స్పందించడంతోనే వర్మ ఇలా చేసినట్లు తెలుస్తోంది.

చంద్రవదన్ వార్నింగ్
సినీ రంగాన్ని టార్గెట్ చేశారనడం సరికాదని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత విచారిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ విషయం చాలా గంభీరమైనదని, హాస్యాస్పదం చేసే ప్రయత్నాలు చేయడం మంచిది కాదని అన్నారు. సినీ రంగంలో ఉన్న పెద్ద వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలని సున్నితంగా హెచ్చరించారు.

బాధ్యతగా వ్యవహరించాలి
మాదక ద్రవ్యాలు సమాజానికి చేటు చేస్తాయని చంద్రవన్ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమకు సహకరిస్తున్నారని, ఈ క్రమంలో కొన్ని అసంబంధ వ్యవహారాలు బయటికి తేవడం సరికాదననారు. డ్రగ్స్ కేసు విషయలో ఎక్సైజ్ శాఖ సీరియస్‌గా ఉందని అన్నారు. విచారణ చట్ట ప్రకారం, సుప్రీం సూచనల ఆధారంగా జరుగుతోందని చంద్రవదన్ స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ దర్యాప్తును వక్రీకరించడం సరికాదని అన్నారు.

సీఎం వదలొద్దన్నారు..
డ్రగ్స్ కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని, ఎంత పెద్ద వారినైనా వదలొద్దని స్పష్టం చేసినట్లు చంద్రవదన్ తెలిపారు. అకున్ సబర్వాల్ చాలా జాగ్రత్తగా కేసును డీల్ చేస్తున్నారని చెప్పారు. సాఫీగా దర్యాప్తు జరుగుతున్న సమయంలో అధికారుల నైతిక స్థితిని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పరోక్షంగా వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమకు ఏ రంగంపై వివక్ష లేదని అన్నారు. కేసు తప్పుదోబ పట్టించడం, నీరుగార్చే విధంగా ఎవరూ చేయవద్దన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని చెప్పారు. మీడియాలో ఎక్సైజ్ శాఖపై వస్తున్న కథనాల మేరకు తాను, అకున్ సబర్వాల్ మీడియా ముందుకు వచ్చామని చంద్రవన్ తెలిపారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications