మరికొన్ని గంటల్లో తులారాశిలో చతుర్గ్రాహి యోగం; ఈ రాశులవారి పంట పండినట్టే!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాల మార్పు కొన్ని రాశుల పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తే, మరికొన్ని రాశుల పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే అక్టోబర్ 18వ తేదీన సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించనుండటంతో ఇప్పటికే తులా రాశిలో కుజుడు, బుధుడు, కేతువులు ఉండడంతో తులా రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది.
అయితే ఈ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. తులారాశిలో ఏర్పడే చతుర్గ్రాహి యోగం వల్ల కొన్ని రాశుల వారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా మేషం, మిధునం, మకర రాశి, కుంభరాశి జాతకులు ఈ సమయంలో మంచి ప్రయోజనాలను పొందుతారు.

మేష రాశి:
మేష రాశి జాతకులకు చతుర్గ్రాహి యోగం బాగా కలిసి వస్తుంది. ఇది మీ జీవితంలో శుభ సంకేతంగా ఉంటుంది. భాగస్వామ్య పనులలో మేషరాశి జాతకులు విజయాన్ని సాధిస్తారు. వృత్తిపరంగా ఉండే అడ్డంకులు కూడా చతుర్గ్రాహి యోగం సమయంలో తొలగిపోతాయి. సంపదలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితంలోనూ సంతోషం మరియు శాంతి ఉంటాయి.
మిధున రాశి:
చతుర్గ్రాహి యోగం వల్ల మిధున రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. సామాజిక హోదా మరియు ప్రతిష్ట పెరుగుతుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలకు ఆస్కారం ఉంది. కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు.
మకర రాశి:
చతుర్గ్రాహి యోగం వల్ల మకర రాశి జాతకులు అన్ని రంగాలలోనూ అఖండ విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపద, శ్రేయస్సు కలుగుతుంది. చతుర్గ్రాహి యోగం వల్ల కుంభ రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది.
కుంభరాశి:
కుంభరాశి వారి జీవితంలో సంతోషం వెల్లి విరుస్తుంది. వారి ఆదాయ వనరులు పెరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. పనిలో ఏర్పడే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.చాతుర్గ్రాహి యోగం కారణంగా ఈ సమయంలో చాలా అనుకూలమైన ఆహ్లాదమైన సమయాన్ని మీరు కలిగి ఉంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications