హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కలకలం: ఆ ఇళ్లే లక్ష్యంగా బంగారం దొంగతనాలు (వీడియో)
హైదరాబాద్: నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత విలాస్‌లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఓ విల్లాలోకి బొరబడిన చెడ్డీ గ్యాంగ్.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చెడ్డీ గ్యాంగ్ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించడంతో వారి వేటలో నిమగ్నమయ్యారు.

మాదాపూర్ ఎస్ఓటీ సీసీఎస్ క్రైమ్ బృందాలు చెడ్డీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.
మియాపూర్, రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడటం కలకలం రేపుతోంది.
మియాపూర్: వసంత విలాస్ లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్..ఓ ఇంట్లో చొరబడి ఆభరణాలు దోచుకెళ్లిన దొంగలు pic.twitter.com/gG93dwW5WP
— oneindiatelugu (@oneindiatelugu) August 11, 2023
ఈ చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడటంతోపాటు హత్యలకు కూడా వెనుకాడరు. దోపిడీకి పాల్పడే సమయంలో ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీస్తారు. ఒంటికి నూనె రాసుకుని ఎవరికీ దొరక్కుండా దొంగతనాలకు పాల్పడతారు. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడింది. విజయవాడ, విశాఖపట్నం, తదితర నగరాల్లోనూ ఈ చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. కొంత విరామం ఇచ్చిన ఈ గ్యాంగ్ మళ్లీ ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వీరి ఆట కట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications