హన్మకొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, మారణాయుధాలతో చోరీలకు, అలెర్ట్!
తెలంగాణా రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్స్ దడ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ స్వైర విహారం చేస్తున్నారు. మారణాయుధాలతో తిరుగుతూ ఆర్ధరాత్రి దోపిడీకి పాల్పడుతున్నారు . నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకొని చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు ప్రయత్నిస్తోందని ఇప్పుడు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ నేపధ్యంలో పోలీసులు సూచిస్తున్నారు .
ఓరుగల్లులో చెడ్డీ గ్యాంగ్స్ కలకలం
ఇంతకు ముందు హైదరాబాద్ లో మాత్రమే కనిపించిన చెడ్డీగ్యాంగ్స్ , ఇప్పుడు హన్మకొండ, వరంగల్ లలో కూడా కనిపించటం కలకలం రేపుతుంది. వారు చోరీలకు పాల్పడుతున్న క్రమంలో ఓరుగల్లు వాసుల్లో ఈ గ్యాంగ్ పై భయం పట్టుకుంది. చెడ్డీలు,తలపాగాలు ధరించి, మారణాయుధాలను చేత్తో పట్టుకొని, అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత పది మంది గ్యాంగ్ తో ఈ గ్యాంగ్లు దోపిడీకి తెగబడుతున్నారు.

పక్కా రెక్కీతో చెడ్డీ గ్యాంగ్ చోరీలు
వీరు దోపిడీ చేసే సమయంలో అడ్డొస్తే ప్రాణాలు తీయడానికి అయినా వెనుకాడరు. ఎలాంటి ఇంటి తాళం అయినా సరే ఒకే ఒక రాడ్డుతో చాకచక్యంగా తెరవగల టెక్నిక్ చెడ్డీ గ్యాంగ్ సొంతం. అంతేకాదు ఎక్కడైనా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, పక్కాగా రెక్కీ వేసి మరీ చోరీలకు పాల్పడతారు. కనీసం 10 మంది సభ్యులు ఉండే ఈ గ్యాంగ్ లు సిసి టివి ఫుటేజ్ లో మాత్రమే కనిపించి, పట్టుబడకుండా తప్పించుకుంటారు.
హన్మకొండలో ఒక వ్యక్తి ఇంట్లో చోరీ... సీసీ టీవీ కెమెరాలలో రికార్డ్
తప్పించుకునే వ్యూహాన్ని కూడా ముందే సిద్ధం చేసుకొని దొంగతనాలకు దిగుతారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో ఉన్న ఇళ్లనే దోపిడీకి ఎంచుకుంటారు. ఇక తాజాగా హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న బత్తిని వెంకటనారాయణ అనే వ్యక్తి ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చొరబడి 500 గ్రాముల రెండు వెండి నాణేలు ఎత్తుకెళ్లడంతో పాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
చెడ్డీ గ్యాంగ్ విషయంలో పోలీసులు అలెర్ట్
అయితే సీసీ టీవీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి వారు చెడ్డీ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించి అప్రమత్తం అయ్యారు. ఇక ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠాను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు సిసి టివి ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నగరంలోని లాడ్జీలు, హోటల్స్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నగర శివారులో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications