దేవాదాయశాఖ అధికారులపై కారంపొడి, పెట్రోల్ తో కబ్జాదారుల ఎటాక్.. చెన్నూరులో షాకింగ్ ఘటన!

తెలంగాణ రాష్ట్రంలో దేవదాయ శాఖ భూములు, ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు కబ్జాలకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కబ్జాలను అరికట్టడం కోసం హైదరాబాదులో హైడ్రా రంగంలోకి దిగితే, రాష్ట్రవ్యాప్తంగా అధికారులు గుర్తించిన కబ్జాలను తొలగించి తిరిగి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా చెన్నూరులో దేవాదాయ శాఖ భూముల కబ్జా వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది.

దేవాదాయ శాఖ భూమి కబ్జా

మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థానిక జగన్నాథ స్వామి దేవాలయ భూమి కబ్జాకు గురైంది. చెన్నూరు పట్టణ శివారు జాతీయ రహదారి సమీపంలో కోట్ల విలువగల మూడు ఎకరాల 20 గుంటల జగన్నాథస్వామి ఆలయానికి చెందిన భూమిని పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని చుట్టూ సిమెంట్ పిల్లర్లు వేసి, మామిడి మొక్కలు నాటిన సమాచారంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి రంగంలోకి దిగారు.

chennur tension encroachers attacked officials with chilli powder and petrol police filed case on encroachers

కారంపొడి, పెట్రోల్ తో దాడి .. ప్రాణభయంతో అధికారులు పరుగు

ఈ క్రమంలో కబ్జాదారులు కారంపొడి, పెట్రోల్ తో దాడికి తెగబడ్డారు.ఊహించని విధంగా కబ్జాదారులు కారంపొడి, పెట్రోల్ తో దాడి చేయడంతో అధికారులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. ప్రాణభయంతో అధికారులు పరుగులు తీశారు. ఈ దాడిలో కొందరు అధికారులకు స్వల్ప గాయాలు కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణదారుల ను అడ్డుకొని, ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.

కబ్జాదారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక

ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కబ్జాదారుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చెన్నూరులో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

జెసిబీలతో ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన సిమెంటు పిల్లర్ ల కూల్చివేత

అయితే ఈ ఆక్రమణల పైన స్పందించిన దేవదాయ శాఖ సూపరింటెండెంట్ రవి కిషన్ దేవాదాయశాఖ భూములను కబ్జా చేసిన క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జెసిబీ లతో ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన సిమెంటు పిల్లర్ లను కూల్చివేయడం జరిగిందని పేర్కొన్నారు. విధులను అడ్డుకున్న వారిపైన చర్యలకు ఉపక్రమించినట్టు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+