Chicken: చికెన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
ఎండలు మండిపోతున్న నేపథ్యంలో చికెన్ ప్రియులకు షాక్ వార్త వచ్చింది. ముక్క లేనిదే బుక్క దిగని వారికి ఇది చేదు వార్త అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చికెన్ ధర తక్కువగా ఉండడంతో భారీగా చికెన్ తిన్న వారు ఇప్పుడు అలా చేయలేరు. ఎందుకటే చికెన్ ధరలు ఎక్కసారిగా అమాంతం పెరిగాయి. చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏప్రిల్ 7 ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి.
కేజీకి ఏకంగా రూ.100లు పెరిగింది. ప్రస్తుతం కేజీ చికెన్ ధర ఏకంగా రూ.300కు పెరిగింది. మొన్నటి వరకు కిలో చికెన్ రూ.200గా ఉన్నాయి. దీంతో చికెన్ కొనలేని పరిస్థితి ఏర్పడింది. కిలో కొనే వారు అర కేజీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఎండల తీవ్ర పెరగడమే చికెన్ ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో ఫ్రౌల్టీ ఫామ్ లోని కోళ్లు మృత్యువాత పడుతున్నాయని చెబుతున్నారు.

దీంతో కోళ్ల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. సరఫరా తగ్గిపోవడంతో మార్కెట్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వచ్చే కొద్ది రోజుల్లోచికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కోడి ధరలు మాత్రం నార్మల్ గానే ఉన్నాయి. కోడి ఒక్కొటి రూ.4 నుంచి రూ.5 వరకు పలుకుతున్నాయి. ఎండకాలంలో గుడ్ల వినియోగం తగ్గడంతో రేట్లు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
కూరగాయలు ధరలు కాస్త ఆశజనకంగా ఉన్నాయి. దాదాపు అన్ని కూరగాయలు కిలో రూ.60, 70 లోపే ఉన్నాయి. ఇక మటన్ ధర కిలో రూ. 800 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది.












Click it and Unblock the Notifications