కెటిఆర్‌లానే 2 ఏళ్ళ పాప వేషధారణ: మంత్రి ఫిదా...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండేళ్ళ చిన్నారి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ మాదిరిగా డ్రెస్ వేసుకొని అందరినీ అబ్బురపరిచింది. ఈ ఫోటోలను చూసి మంత్రి కెటిఆర్ కూడ సంబరపడ్డాడు. అంతేకాదు ఈ ఫోటోలు తనకు బాగా నచ్చాయంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

Children's Day: Two-year-old girl dresses as KTR for school fancy dress event

బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. పిల్లలు కూడ ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే ఓ పాఠశాలలో నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో రెండేళ్ళ చిన్నారి ఐరా మంత్రి కెటిఆర్ అవతారం ఎత్తారు. కెటిఆర్ ధరించే దుస్తులను ధరించారు.

అంతేకాదు పార్టీ సమావేశాల్లో కెటిఆర్ తన మెడలో వేసుకొనే పార్టీ కండువాను కూడ వేసుకొంది. కెటిఆర్ తరహలోనే చేతులు పైకెత్తి నినాదాలు చేసింది. ఈ తరహ ఫోజులతో ఐరా పోటోలను కెటిఆర్ ట్విట్టర్‌కు ఆ పాప తల్లిదండ్రులు పోస్ట్ చేశారు.తన మెడలో కెటిఆర్ అనే పేరు రాసి ప్లకార్డును వేసుకొంది.

ఈ ఫోటోలను చూసిన కెటిఆర్ కూడ వెంటనే స్పందించారు. ఆ చిన్నారి ఫొటోలు నా మనసుకు ఎంతగానో హత్తుకున్నాయి. ఆ పాప తల్లిదండ్రులకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్‌ ట్విట్‌​ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister of Information Technology Kalvakuntla Taraka Rama Rao aka KTR, today tweeted few pictures of a 2-year-old baby girl who had dressed like him to participate in her school's fancy dress event organised as part of Children's day celebrations.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి