గోవా వెళ్లేవారికి ఛిల్ న్యూస్..సికింద్రాబాద్ నుండి స్పెషల్ రైలు.. పండుగే పండుగ!
చాలామంది ప్రతి సంవత్సరం పర్యాటక ప్రాంతమైన గోవాకు వెళ్ళొస్తుంటారు. గోవా వెళ్లడం కోసం రకరకాల రవాణా సాధనాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే టూరిజం కోసం గోవా వెళ్లేవారికి ఉపయోగపడేలాగా, ప్రజల డిమాండ్ కు తగ్గట్టు దక్షిణ మధ్య రైల్వే కొత్త స్పెషల్ రైలు ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ రైలును నేడు కేంద్రమంత్రికిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
సికింద్రాబాద్ వాస్కోడిగామా స్పెషల్ ట్రైన్.. కేంద్ర మంత్రి ప్రారంభం
సికింద్రాబాద్ వాస్కోడిగామా మధ్య ఈ కొత్త రైలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు ఉదయం 11 గంటలకు 45 నిమిషాలకు ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుంచి ఈ నెల 9న, వాస్కోడిగామా నుంచి ఈ నెల 10న ప్రారంభమవుతాయి.ఈ రైలు హైదరాబాద్ నుంచి కర్ణాటక గోవాకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

గోవా వెళ్లి ఛిల్ అవ్వాలనుకునే వారికి మంచి అవకాశం
సికింద్రాబాద్ నుంచి గోవా వాస్కోడిగామాకు ఈ కొత్త రైలు 20 గంటల్లో చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ కొత్త రైలు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఏడు గంటల 20 నిమిషాలకు గోవా వాస్కోడిగామాకు చేరుకుంటుంది. ఇక ఈ స్పెషల్ ట్రైన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గోవా వెళ్లి చిల్ అవ్వాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం.
స్పెషల్ ట్రైన్ రూట్ ఇలా
ఇక ఈ స్పెషల్ ట్రైన్ రూట్ విషయానికి వస్తే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ స్పెషల్ ట్రైన్ కాచిగూడ ,షాద్నగర్, జడ్చర్ల మహబూబ్నగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్ళారీ, హోస్పేట, కొప్పల్, గదడ్, హుబ్బలి, దర్వాడ్, లోండా, మడగాన్ మీదుగా మొత్తం 20 స్టేషన్లలో ఆగుతూ గోవాకు వెళుతుంది.
సికింద్రాబాద్ వాస్కోడిగామా మధ్య నడిచే రైళ్ళు ఇలా
ఇక ఈ స్పెషల్ ట్రైన్ లో ఎల్ హెచ్ బి కోచ్లతోపాటు ఏసీ, నాన్ ఎసి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ వాస్కోడిగామా రైలు బయలుదేరుతుంది. ఇక ప్రతి గురువారం, శనివారాలలో వాస్కోడిగామా సికింద్రాబాద్ రైలు బయలుదేరుతుంది. అయితే ప్రస్తుతం కూడా సికింద్రాబాద్ వాస్కోడిగామా మధ్య రెగ్యులర్ సర్వీస్ ఉంది. అది ప్రతి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాలలో నడుస్తుంది.
ప్రయాణికుల డిమాండ్ నేపధ్యంలో కొత్త రైలు
ప్రయాణికుల నుంచి తీవ్రమైన డిమాండ్ ఉండడంతో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వాస్కోడిగామాకు కొత్త రైలును అందుబాటులోకి తీసుకువచ్చి పర్యాటకుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచింది దక్షిణ మధ్య రైల్వే ఈ క్రమంలోనే నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రయోగాత్మకంగా ఈ రైలును ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications