Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన పనికి చైనా స్పందన.. తగ్గని రాజాసింగ్ ఏమన్నారంటే

తెలంగాణా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన పనికి చైనా స్పందించింది. కరోనా వైరస్ చైనా లో మొదట వచ్చినంత మాత్రాన అది చైనీస్ వైరస్ కాదని ఆయన పేర్కొన్నారు. ఇక అసలు ఏం జరిగిందంటే .. కరోనా మహమ్మారి పై పోరాటానికి చిహ్నంగా భారతీయులంతా దీపాలు వెలిగించి ఐక్యతను చాటాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఈనెల 5న ధూల్‌పేటలో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హడావుడి చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి 'చైనీస్‌ వైరస్‌ గో బ్యాక్‌' అంటూ ఆయన నినాదాలు చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ మొదట చైనాలో రావటంతో అప్పటి నుండి ఇది చైనీస్ వైరస్ అని ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

దీనిపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. భారత్‌లోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా కౌన్సిలర్‌(పార్లమెంట్‌) లియూ బింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో చైనా వైరస్ కు కారణం తమ దేశం కాదని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు చైనీస్‌ వైరస్‌ గో బ్యాక్‌ అని చేసిన నినాదాలను ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. చైనా కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియజేసిన తొలిదేశం అని ఆయన తెలిపారు.

 Chinas response to MLA Rajasingh.. embassy condemned the MLAs slogans

అయితే దీని అర్థం ఈ వైరస్‌ చైనా నుంచి ఉద్భవించిందని కాదన్నారు లియూ బింగ్‌ . దీనిపై రాజాసింగ్‌ ఏ మాత్రం తగ్గకుండా మరోమారు రివర్స్ ప్రశ్న వేశారు. 'అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం ఇది కరోనా వైరస్‌ కాదు చైనా వైరస్‌ అని పేర్కొన్న విషయం నిజంకాదా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఇక రాజా సింగ్ చైనా ఎంబసీ వారికి వేసిన ప్రశ్నకు ఏం సమాధానం వస్తుందో మరి వేచి చూడాలి .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+