జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో చిరంజీవి.. రేవంత్ తో భేటీ.. అనూహ్య పరిణామం!
తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఇప్పుడు రాజకీయంగా రసవత్తరంగా మారుతుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా? మెగాస్టార్ కనుక గెలిస్తే హోం మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి ఆఫర్ ఇస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు.
చిరంజీవి రాజకీయంపై చర్చ
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో సినీస్టార్ ను ఎందుకు బరిలో దింపాలి అనుకుంటున్నారు? అసలు రేవంత్ రెడ్డి ని మెగాస్టార్ చిరంజీవి కలవడం వెనుక మతలబు ఇదేనా? అంటూ బీఆర్ఎస్ నేతలు గుసగుసలాడుతున్నారు. ఇక తాజాగా జరుగుతున్న ప్రచారంతో మరోమారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఈ కలవడం వెనుక మతలబు వేరే ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో మెగాస్టార్ చిరంజీవిది దించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో చిరంజీవిని దింపాలని రేవంత్ యత్నం
రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలపై దృష్టి సారించిన మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో దించితే కచ్చితంగా విజయం సాధిస్తారు అన్న భావనలో ఉన్న రేవంత్ రెడ్డి చిరంజీవి ముందు ఆ ప్రపోజల్ పెట్టినట్టుగా చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో పోటీ పడడం కోసం కాంగ్రెస్ పార్టీ నుండి స్థానిక ఆశావహులు చాలామంది ఉన్నారు.
చిరంజీవిని పోటీ చేయించాలనే రేవంత్ ఆలోచన వెనుక
అయినప్పటికీ వారందరినీ కాదని చిరంజీవికి ఆఫర్ చేయడం వెనుక ఆసక్తికర విషయం ఉందని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు జరిపిన సర్వేలో బి ఆర్ ఎస్ తో పోటీ విషయంలో కాంగ్రెస్ వెనుకబడి ఉందని ఇక దీనిని సీరియస్ గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి, చిరంజీవిని పోటీ చేయిస్తే తిరిగే ఉండదని భావిస్తున్నారని చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరగబోతుంది?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించిన పార్టీ రానున్న లోకల్ బాడీ ఎన్నికలలోను, జిహెచ్ఎంసి ఎన్నికలలోను విజయం సాధించే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్న క్రమంలోనే చిరంజీవితో ఈ విషయం పైన చర్చించి అధిష్టానానికి నివేదించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఇటీవల భేటీ జరిగినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరగబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications