కొండా సురేఖకు చిరంజీవి హెచ్చరిక!

మంత్రి కొండ సురేఖ సమంత, నాగచైతన్య విడాకులపైన చేసిన సంచలన వ్యాఖ్యలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతుంది. కొండా సురేఖ సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని చెబుతూ కేటీఆర్ ని టార్గెట్ చేసే క్రమంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఆపాలంటే సమంతను తన దగ్గరకు పంపించాలని కేటీఆర్ అడిగాడని బాంబు పేల్చారు.

సురేఖ షాకింగ్ కామెంట్స్... సినీవర్గాల ఆగ్రహం
సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగార్జున, నాగచైతన్య ఒత్తిడి తెచ్చారని అందుకు సమంత ఒప్పుకోకపోవడంతోనే ఆమెకు విడాకులు ఇచ్చారని కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు . అత్యంత జుగుప్సాకరమైన, తీవ్ర అభ్యంతరకరమైన విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన తెలుగు చిత్ర పరిశ్రమ స్పందిస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటు సినీ నటులు పలువురు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.

chiranjeevi serious warning to konda surekha over her comments on samantha

ఆ అవమానకర వ్యాఖ్యలకు బాధ పడ్డాను
జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, ఆర్కే రోజా తదితరులు కొండా సురేఖ వ్యాఖ్యల పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం కొండా సురేఖ వ్యాఖ్యల పైన అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన చిరంజీవి గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి తను చాలా బాధపడ్డానని చిరంజీవి పేర్కొన్నారు.

ఇది సిఇగు చేటు అన్న చిరంజీవి
వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటని చిరంజీవి ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ సభ్యులపై ఇటువంటి దుర్మార్గపు మాటలను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తామని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మహిళలను రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటని ఇది తప్పని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.

అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు
రాజకీయ నాయకులు తమ రాజకీయం కోసం అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు చేయడం మంచిది కాదని చిరంజీవి పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఎవరు ఈ స్థాయికి దిగజారకూడదు అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు ఉదాహరణగా ఉండాలని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చిరంజీవి సూచించారు.

మీ ప్రసంగాల ద్వారా సమాజాన్ని కలుషితం చేయకూడదని హితవు
సమాజాన్ని మంచిగా మార్చడం కోసం తాము నాయకులను ఎన్నుకుంటామని పేర్కొన్న చిరంజీవి మీ ప్రసంగాల ద్వారా సమాజాన్ని కలుషితం చేయకూడదని హితవు పలికారు. ఇటువంటి హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని నమ్ముతున్నానని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఏది ఏమైనా కొండా సురేఖ సమంత కు క్షమాపణ చెబుతూ అన్యధా భావించవద్దని ట్వీట్ చేసినప్పటికీ సినీ వర్గాలలో ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారటం లేదు.

సురేఖ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్న సినీ ఇండస్ట్రీ
కొండా సురేఖ చేసిన ఇటువంటి వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సమంత పై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. సురేఖ మాత్రమే సినీ వర్గాల మీద ఇలాంటి అనుచిత ఆరోపణలు సహించేది లేదని గళం వినిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+