హైదరాబాద్ జూపార్క్ లో ఆ జంతువు..! ఒకేరోజు 23 వేల మంది సందర్శన..!
హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ ను ఒకేరోజు 23 వేల మంది సందర్శించారు. డిసెంబర్ 25 క్రిస్మస్ సెలవులు కారణంగా ఒకే రోజు జూపార్క్ కు 23,440 మంది పర్యటకులు సందర్శించినట్లు జూపార్క్ అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో ఇలా అధిక సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. కానీ ఈ సారి క్రిస్మస్ సెలవుల్లో ఈ రికార్డును అధిగమించడం శుభ పరిణామం అని అధికారులు స్పష్టం చేశారు.
పర్యటకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జూ సిబ్బందిని అధిక సంఖ్యలో మోహరించారు. తాగునీటి సదుపాయాలను విస్తరించారు. జూపార్క్ లోని ఒక్కో విభాగం వద్ద సెక్యూరిటీ గార్డులను మోహరించి పర్యటకులను దిశా నిర్దేశం ఇస్తున్నారు. ఈ వీకెండ్ లో మరింత మంది పర్యటకులు జూపార్క్ ను సందర్శించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు.
జూపార్క్ లో ఇటీవల అనేక కొత్త జంతువులు, పక్షులను సంరక్షణ కోసం తీసుకొచ్చారని అందువల్ల టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని నెహ్రూ జూపార్క్ అధికారి జే. వసంత తెలిపారు. కొత్తగా జీబ్రా, మీర్కట్, సెర్వల్ క్యాట్, బారాసింగా, వైట్ స్వాన్స్.. అలాగే ఇతర పక్షులు, పాములను ఇటీవల ఇతర జూ పార్కుల నుంచి తరలించినట్లు వివరించారు. కొత్తగా వచ్చిన జంతువులను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వచ్చినట్లు తెలిపారు.

ప్రస్తుతం నెహ్రూ జాపార్క్ లో 199 రకాల క్రూర జంతువులు ఉన్నాయి. పలు దేశాల నుంచి ఈ జంతువులను ఇక్కడికి తరలించారు. మరోవైపు గుజరాత్ లోని జామ్ నగర్ లో రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన అంతర్జాతీయ వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ కేంద్రమైన వంతారా నుండి అరుదైన జంతువులు త్వరలోనే హైదరాబాద్ జూపార్క్ కు రానున్నాయి. ఇక్కడి నుంచి ఒక జత కంగారూలను తీసుకురానున్నారు. వీటి కోసం ఎన్ క్లోజర్లు.. అలాగే రాత్రిపూట నివాస గృహాలను సైతం ఇప్పటికే సిద్ధం చేసినట్లు జూ అధికారులు పేర్కొన్నారు. ఇక ఎక్స్ ఛేంజ్ లో భాగంగా కంగారూలకు బదులు హైదరాబాద్ జూ నుంచి ఒక ఏనుగును వంతారాకు పంపనుంది.
ఇక హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మీర్ ఆలం ట్యాంక్ సమీపంలో బహదూర్ పురాలో ఉంది. ఈ పార్కు దాదాపు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ జూపార్కును ప్రతి సోమవారం మూసివేస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:00 వరకు తెరిచి ఉంటుంది. టికెట్ ఫీజు విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్దలకు (12 సంవత్సరాల కంటే ఎక్కువ) రూ. 100 ఉంది. అలాగే పిల్లలకు (3-12 సంవత్సరాలు) రూ. 50 గా ఉంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications