అందులో ట్రేడ్‌ మార్క్‌గా కేసీఆర్‌ - సీజేఐ ఎన్వీ రమణ అభినందన : దేశానికే ఆదర్శంగా - ముఖ్యమంత్రి..!!

చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్‌ మార్క్‌గా కేసీఆర్‌ అని జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అభినందించారు. తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో సీజేఐ ఎన్వీ రమణ కీలక అంశాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ సెంటర్‌ వచ్చిందని చెప్పారు. వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని వెల్లడించారు. హైకోర్టులో ఇటీవల జడ్జీల సంఖ్య పెంచామని చెప్పారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల పెంపు అవసరమన్నారు. రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించామన్నారు. న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నామని చెప్పారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామని వెల్లడించారు. తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామని చెప్పారు.

CJI NV Ramana appreciated CM KCR Efforts to strengthen the juiciary in all aspects

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారని.... తెలంగాణలో కేసీఆర్‌ మాత్రం 4 వేల 320కి పైగా ఉద్యోగాలను సృష్టించారని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని సీఎం కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యుత్‌ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామని కేసీఆర్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+