నిజమే.. ఆ సత్తా కేసీఆర్‌కు ఉంది, ముందు నిలిస్తే విజయమే: హేమంత్ సోరెన్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ 'థర్డ్ ఫ్రంట్' కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు తనతో టచ్ లోకి వచ్చారని, తన ప్రతిపాదనకు సమ్మతించారని కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్.

కేసీఆర్‌తో చర్చలు నిజమే: హేమంత్ సోరెన్

కేసీఆర్‌తో చర్చలు నిజమే: హేమంత్ సోరెన్

కేసీఆర్ తృతీయ కూటమి ప్రతిపాదనపై జేఎంఎం నేత హేమంత్ సోరెన్ మాట్లాడారు. కేసీఆర్ తనతో మాట్లాడారని చెప్పిన ఆయన.. చాలా అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందన్నారు. ప్రధానంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నామని అన్నారు.

Recommended Video

    KCR's Third Front : Will Indian Politics Change ?
    కేసీఆర్ ముందు నిలిస్తే విజయమే:

    కేసీఆర్ ముందు నిలిస్తే విజయమే:

    దేశంలో తాగునీరు, ఆరోగ్యం, రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం లేనివి గానే ఉన్నాయని హేమంత్ సోరెన్ అన్నారు.

    ఈ పరిస్థితి రూపుమాపి రైతులు, బడుగు, బలహీన వర్గాల తరఫున రాజకీయ పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నంలో కేసీఆర్ వంటి ఉద్యమ నేత ముందు నిలిస్తే పోరాటంలో త్వరగా విజయం సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు.

     ఆ సత్తా కేసీఆర్‌లో ఉంది:

    ఆ సత్తా కేసీఆర్‌లో ఉంది:

    తమ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తాము ఒంటరిగా పోరాడుతున్నామని హేమంత్ సోరెన్ తెలిపారు. ఆ పార్టీకి బదులిచ్చే సత్తా తమకు ఉందని అన్నారు.

    ఇదే తరహాలో అనేక రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఉన్నారని, వారంతా కలిస్తే జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవచ్చునని అన్నారు. ఈ శక్తులన్నింటిని ఒకే వేదిక పైకి తీసుకువచ్చే సత్తా ఉన్న నేతల్లో కేసీఆర్ ఒకరని అన్నారు.

    చర్చంతా కేసీఆర్ పైనే..:

    చర్చంతా కేసీఆర్ పైనే..:

    ఇంకా ఎజెండా కూడా ఖరారు చేయకముందే.. తన ప్రతిపాదనకు మద్దతు పెరుగుతుండటం పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ జేఎంఎం నేత హేమంత్ సోరెన్ లతో పాటు పలువురు నేతలు ఇప్పటికే మద్దతు ప్రకటించినట్టు చెప్పారు.

    కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కచ్చితంగా యావత్ భారతాన్ని చుట్టుముడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 70ఏళ్ల రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ వల్ల మార్పు సాధ్యం కాలేదని, ప్రత్యామ్నాయంగా తాను ముందడుగు వేస్తున్నానని చెప్పారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌పై జరుగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+