కాళేశ్వరం ప్రాజెక్ట్ మూసెయ్యండి.. కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టుపై మాజీ ఐఏఎస్ సంచలనం!!

కాళేశ్వరం ప్రాజెక్టును మూసేయండి.. రాష్ట్ర ఆర్థిక వనరులను కాపాడండి అంటూ పోస్ట్ పెట్టిన మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన, కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు పై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోయడానికి కరెంటు కొరత ఏర్పడిందని, పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోయేలేని పరిస్థితి నెలకొందని వివిధ పత్రికలలో వచ్చిన వార్తలను ఉటంకిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరంపై ప్రాజెక్ట్ పై ఆకునూరి మురళి సంచలనం

కాళేశ్వరంపై ప్రాజెక్ట్ పై ఆకునూరి మురళి సంచలనం

కాళేశ్వరం ప్రాజెక్టును మూసేయండి.. రాష్ట్ర ఆర్థిక వనరులను కాపాడండి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని తోడే బదులు, కాళేశ్వరం రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వడం బెటర్ అంటూ పేర్కొన్నారు. చూడండి ఈ గుదిబండ తెల్ల ఏనుగు ప్రాజెక్టును అంటూ పేర్కొన్న ఆకునూరి మురళి రోజుకు రెండు టీఎంసీల నీళ్లను తోడాల్సింది, 0.4 టిఎంసిలను అంటే 20% నీళ్లనే పంపు చేయగలుగుతున్నారని, ఒక ఎకరం పంటకు ఒక లక్ష ఖర్చు పెడుతున్నారని ఆయన సంచలన పోస్ట్ పెట్టారు.

రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వడం బెటర్: ఆకునూరి మురళి

రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వడం బెటర్: ఆకునూరి మురళి


దీనికంటే రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వడం బెటర్ అంటూ ఆకునూరి మురళి వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రైతులకు నీరు ఇవ్వటానికి ప్రజల ధనం దారుణంగా దుర్వినియోగం అవుతుంది అన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిరోజు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం కోసం బ్యారేజీలను, పంపు హౌస్ లను నిర్మించారు. అయితే ప్రస్తుతం వాటికి ఆ మేర కరెంటు సరఫరా లేకపోవడంతో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పంపులను నడుపుతున్నారు.

కాళేశ్వరంలో పూర్తి స్థాయి మోటర్లు నడపటానికి విద్యుత్ కొరత

కాళేశ్వరంలో పూర్తి స్థాయి మోటర్లు నడపటానికి విద్యుత్ కొరత


దీంతో రోజుకు అర టీఎంసీ నీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారు. పూర్తిస్థాయి మోటర్లను నడిపించడానికి విద్యుత్ కొరత ఉంది. ఇక ఉదయం సమయంలో కరెంటు సరఫరాని బట్టి ఒక మోటర్ ను నడిపిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో మోటర్లను నడపాలంటే రోజుకు 10 నుండి 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది.

సంచలన పోస్ట్ పెట్టిన మాజీ ఐఏఎస్

సంచలన పోస్ట్ పెట్టిన మాజీ ఐఏఎస్

ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిన నేపధ్యంలో ఛత్తీస్ గడ్ నుండి రాష్ట్ర అవసరాల కోసం ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నారు. ఇక అది కూడా పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. ఇక ఈ నేపథ్యంలో ఆకునూరి మురళి రాష్ట్ర ఆర్థిక వనరులకు నష్టం చేస్తూ, రైతుల ప్రయోజనాలకు మేలు చేకూర్చని, కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయాలంటూ సంచలన పోస్ట్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+