వైద్య విద్యలో నవశకానికి నాంది పలికిన కేసీఆర్.. ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం!!
వైద్య విద్యలో నవ శకానికి తెలంగాణా సీఎం కేసీఆర్ నాంది పలికారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేసి తెలంగాణ సీఎం కేసీఆర్ రికార్డు సృష్టించారు. ఒకేరోజు 9 ప్రభుత్వ నూతన మెడికల్ కళాశాలలలో తరగతులు ప్రారంభించి కెసిఆర్ తన మార్కును చూపించారు. రాష్ట్రంలోని కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాలలలో తరగతులను నేడు సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
పండుగ వాతావరణం లో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మెడికల్ కళాశాలల ఏర్పాటుతో జిల్లాలో కలిగే ప్రయోజనాలను, మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉండే హాస్పిటల్లో అందే వైద్య సేవలను ప్రజలకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులకు ఇటీవల మంత్రి కేటీఆర్, హరీష్ రావు సూచించిన నేపథ్యంలో మెడికల్ కళాశాలలు ప్రారంభమైన జిల్లాలలో భారీ ర్యాలీలను నిర్వహించారు.

కరీంనగర్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నూతన మెడికల్ కళాశాల ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హైదరాబాద్ ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా ప్రారంభించగా, అక్కడ ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి సంక్షేమ పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, కళాశాల విద్యార్థులు, ఎన్ సిసి, విద్యార్థులు పాల్గొన్నారు.
వేలాదిగా వచ్చిన వారితో కరీంనగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రేకుర్తి నుండి కొత్తపల్లి లోని మెడికల్ కళాశాల వరకు కొనసాగింది. ఇదిలా ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడికల్ కళశాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వర్చువల్ గా ప్రారంభించగా ఈ కార్యక్రమానికి, రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీలో రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు.
అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలలోనూ పండుగ వాతావరణంలో భారీ ర్యాలీలతో, నూతన మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వర్చువల్ విధానంలో సీఎం కేసీఆఆర్ మెడికల్ కాలేజీలు ప్రారంభించిన కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications