వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధర్మపురిలో పుష్కరాలు ప్రారంభించిన సిఎం కెసిఆర్: భద్రాద్రిలో జీయర్‌స్వామి

|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: జిల్లాలోని ధర్మపురి వద్ద గోదావరి పుష్కరాలను తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలో కెసిఆర్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. పీఠాధిపతులతో కలిసి గోదావరి నదికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి.

భద్రాచలం వద్ద చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో అంకురార్పణ

ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పుష్కరాలకు చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ప్రారంభ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరయ్యారు. భారీగా తరలివచ్చిన భక్తులకు భద్రాచలం వద్ద పుష్కరఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

మంగపేటలో కడియం

వరంగల్‌ జిల్లా మంగపేటలో గోదావరి పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. పుష్కర స్నానాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

బాసరలో జోగు రామన్న

ఆదిలాబాద్‌ జిల్లా బాసర అమ్మవారి సన్నిధిలో తెలంగాణ మంత్రి జోగురామన్న మహాపుష్కర పూజలు చేశారు. గోదావరిలో పుష్కరస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో బాసర భక్త జనసంద్రంగా మారింది.

కాళేశ్వరంలో స్నానమాచరించిన ఈటెల, తలసాని

కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌లు పుష్కర పుణ్యస్నానం ఆచరించారు. కాళేశ్వరానికి భారీగా భక్తులు తరలిరావడంతో పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి.

ధర్మపురిలో కెసిఆర్

ధర్మపురిలో కెసిఆర్

కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి వద్ద గోదావరి పుష్కరాలను తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.

ధర్మపురిలో కెసిఆర్

ధర్మపురిలో కెసిఆర్

స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలో కెసిఆర్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు.

ధర్మపురిలో కెసిఆర్

ధర్మపురిలో కెసిఆర్

పీఠాధిపతులతో కలిసి గోదావరి నదికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి.

ధర్మపురి గోదావరి

ధర్మపురి గోదావరి

పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ధర్మపురి క్షేత్రం

ధర్మపురి క్షేత్రం

పుష్కరాల ఏర్పాట్లపై సీఎం ధర్మపురిలో సమీక్ష నిర్వహించారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, కలెక్టర్ నీతూ ప్రసాద్, డీఐజీ మల్లారెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ధర్మపురి క్షేత్రం

ధర్మపురి క్షేత్రం

కడెం, పోచంపాడు ప్రాజెక్టుల నుంచి వదిలిన నీరు పుష్కరఘాట్ల వద్దకు చేరుకుందని అధికారులు సీఎంకు ఈ సందర్భంగా వివరించారు.

ధర్మపురి క్షేత్రం

ధర్మపురి క్షేత్రం

విద్యుత్ దీప కాంతుల్లో వెలుగిపోతున్న ధర్మపురి నర్సింహస్వామి ఆలయం.

ధర్మపురి క్షేత్రం

ధర్మపురి క్షేత్రం

విద్యుత్ దీప కాంతుల్లో వెలుగిపోతున్న ధర్మపురి నర్సింహస్వామి ఆలయం.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Tuesday launched Godavari Pushkaralu at Dharmapuri, in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X