టిఆర్‌ఎస్ పార్టీ మొబైల్ యాప్ ఆవిష్కరించిన కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన టిఆర్ఎస్ పార్టీ డైరీ మొబైల్ యాప్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆవిష్కరించారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని, ప్రజలు తెలంగాణ ప్రభుత్వంపై ఏర్పరచుకున్న ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.
అంకితభావంతో పనిచేయాలి

శుక్రవారం సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం, టిఆర్‌ఎస్ యువజన విభాగం, కరీంనగర్ జిల్లా పరిషత్, స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ)డైరీలను వేర్వేరుగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని అన్నారు.
ప్రజలు తెలంగాణ ప్రభుత్వంపై ఏర్పరచుకున్న ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విధాన నిర్ణయాల రూపకల్పనలో కీలకమైన సచివాలయ ఉద్యోగులు తెలంగాణ అభివృద్ధికి అంకితభావం, నైపుణ్యంతో పనిచేయాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా పరిషత్ డైరీ ఆవిష్కరణలో జెడ్పీ చైర్మన్ తుల ఉమా, మంత్రులు ఈటెల రాజేందర్, కె తారక రామారావు, టి హరీశ్‌రావు, పార్లమెంటరీ కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు. ఎస్టీయూ డైరీ ఆవిష్కరణలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి భుజంగరావు, సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications