1964లో అనుకుంటే ఇప్పటికీ పూర్తి కాలేదు, అంతా వాళ్లే: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో వలస పాలకులు ప్రాజెక్టుల పైన అశ్రద్ధ చూపారని, 1964లో తలపెట్టిన ఎస్సారెస్సి ఇప్పటికీ పూర్తి కాలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. కేంద్ర కరువు బృందంతో ఆయన సచివాలయంలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచాలని కోరారు. పశుగ్రాసానికి నిధులు మంజూరు చేయాలన్నారు. తెలంగాణలో ఓ భారీ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చాలా ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడం వల్ల మంచినీటి సమస్య తలెత్తుతోందన్నారు.

వలస పాలకులు తెలంగాణలో ప్రాజెక్టు పైన నిర్లక్ష్యం వహించారన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులను నిర్మించలేదన్నారు. నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు.
అందుకు ఎస్సారెస్సీయే ఉదాహరణ అన్నారు. కరువును ఎదుర్కొనే పరిస్థితుల్లో రాష్ట్రం లేకపోవడానికి వలస పాలకులే కారణం అన్నారు. 1600 టీఎంసీలు సముద్రంపాలు అవుతోందన్నారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications