గాంధీకి కేసీఆర్, గవర్నర్ నివాళి: గాంధీ భవన్‌లో ఘర్షణ (ఫోటోలు)
హైదరాబాద్: మహాత్మా గాంధీజీ 146వ జయంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీఎంతోపాటు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు గాంధీజీని నివాళులర్పించారు.
అనంతరం లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ వద్ద జరుగుతున్న మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా బాపూఘాట్ వద్ద సీఎం, గవర్నర్‌లు నివాళులర్పించారు. ఆ తర్వాత బాపూఘాట్‌లోని గాంధీ జ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
అనంతరం, అక్కడ చేపట్టిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి బండారుదత్తాత్రేయ, ఎంపీ కేకేశవరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. అంతక ముందు బాపూఘాట్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్కలు మహాత్మాకు నివాళులు అర్పించారు.

ఘనంగా గాంధీకి నివాళి: పాల్గొన్న కేసీఆర్, గవర్నర్
అనంతరం లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ వద్ద జరుగుతున్న మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా బాపూఘాట్ వద్ద సీఎం, గవర్నర్‌లు నివాళులర్పించారు.

ఘనంగా గాంధీకి నివాళి: పాల్గొన్న కేసీఆర్, గవర్నర్
అనంతరం, అక్కడ చేపట్టిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి బండారుదత్తాత్రేయ, ఎంపీ కేకేశవరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. అంతక ముందు బాపూఘాట్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్కలు మహాత్మాకు నివాళులు అర్పించారు.

ఘనంగా గాంధీకి నివాళి: పాల్గొన్న కేసీఆర్, గవర్నర్
ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ గాంధీ జయంతిని టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపూఘాట్‌లో టీఆర్‌ఎస్ కండువాలు కప్పిన కుర్చీల్లో కూర్చోవాలా అని ఆయన మండిపడ్డారు.

ఘనంగా గాంధీకి నివాళి: పాల్గొన్న కేసీఆర్, గవర్నర్
మరోవైపు గాంధీభవన్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ నివాళుల కార్యక్రమంలో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పార్టీకి చెందిన గిరిజన నేతల మధ్య వాగ్వాదంతో పాటు ఒకరినొకరు తోసేసుకున్నారు.

ఘనంగా గాంధీకి నివాళి: పాల్గొన్న కేసీఆర్, గవర్నర్
మాజీ ఎంపీ బలరాం నాయక్, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్ లాల్ నాయక్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఆ తర్వాత కాలర్లు పట్టుకునే దాకా వెళ్లింది. పార్టీ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారంటూ జగన్ లాల్, బలరాం నాయక్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఇరువురు నేతలు పెద్దగా కేకలేస్తూ వాగ్వాదానికి దిగారు.

ఘనంగా గాంధీకి నివాళి: పాల్గొన్న కేసీఆర్, గవర్నర్
ఒకానొక సందర్భంలో తనను తోసేసేందుకు యత్నించిన జగన్ లాల్ ను బలరాం నాయక్ కూడా తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన పార్టీ నేతలు కల్పించుకుని ఇరువురు నేతలకు సర్ది చెప్పారని తెలుస్తోంది.

Click it and Unblock the Notifications