నీళ్ల కోసం గవర్నర్‌కు కెసిఆర్ ఫోన్, ఇదే హిందువులపై వివక్ష: పరిపూర్ణానంద
హైదరాబాద్: గోదావరి పుష్కరాల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. పుష్కరాల కోసం కొన్ని ఘాట్ల వద్ద నీళ్లు లేవు. ఇది ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిణామంగా మారింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావుకు ఫోన్ చేశారు.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో దిగువకు నదీ జలాలు విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే కెసిఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గోదావరి పుష్కరాలు ముగిసేంత వరకు నీటిని విడుదల చేయాలని కెసిఆర్ ఆదివారం గవర్నర్‌ను కోరారు.
హిందువులపై వివక్ష: పరిపూర్ణానంద స్వామి

హజ్, జెరూసలేం యాత్రీకులకు రాయితీలు కల్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కర యాత్రికుల నుంచి సర్ ఛార్జీలు వసూలు చేయడం వివక్ష చూపడం కాక మరేమిటని కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి ఆదివారం వాపోయారు.
తక్షణమే బస్సు, రైళ్లలో సర్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పుష్కరాలకు వెళ్లే భక్తులు మొదటి రోజే స్నానం చేయాలనే నమ్మకాన్ని వీడాలని సూచించారు. పన్నెండు రోజుల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా స్నానం చేయవచ్చునని చెప్పారు.
గోదావరికి మహా పుష్కరాలు ఉండవని, గంగానదికి మాత్రమే 144 ఏళ్లకు మహాకుంభమేళా వస్తుందని పరిపూర్ణానంద చెప్పారు. పుణ్యస్నానం తర్వాత నదిలోకి మట్టి విసరడం పుష్కర సంప్రదాయం కాదన్నారు. శ్రీపీఠం ఆధ్వర్యంలో రాజమండ్రిలో, ధర్మపురిలో గోదావరి స్నానాలకు వచ్చే భక్తులకు ఉచితంగా పుష్కర రైస్ పంపిణీ చేస్తామన్నారు. ఆయన కాకినాడలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications