అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష ..మార్చిలో వార్షిక బడ్జెట్
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఇటీవల కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి రానున్న నిధులపై స్పష్టత వచ్చింది. ఇందుకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపొందించే పనిలో పడింది.
బడ్జెట్లో పొందుపర్చాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చ జరిపిన కేసీఆర్ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. బడ్జెట్లో పొందుపర్చాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చ జరిపారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఎన్ని ? ఖజానాకు సమకూరే సొంత రాబడులు ఎన్ని ? కేంద్ర బడ్జెట్ తర్వాత నిధులు, నిధుల కోత , బడ్జెట్ కేటాయింపుల ప్రాధాన్యత పైన కూడా దృష్టి పెట్టారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మార్చి రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఈ ఏడాది జనవరిలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించినా, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి లేకపోయింది. చివరి సారిగా రాష్ట్ర శాసన సభా సమావేశాలు గతేడాది అక్టోబర్ లో జరిగాయి.
వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలను ఏప్రిల్ 13 లోగా నిర్వహించటానికి అవకాశం ఉన్నప్పటికీ, 2021- 22 బడ్జెట్ కు మార్చి 31వ తేదీలోగా అసెంబ్లీ ఆమోదం తప్పనిసరిగా తెలపాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీ కసరత్తు పూర్తి చేసి, మార్చి రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
బడ్జెట్ తయారీ ప్రక్రియ పూర్తయితే మార్చి మొదటి వారంలోనే నిర్వహించే ఛాన్స్
ఈమేరకు సమావేశం నిర్వహించిన కేసీఆర్ బడ్జెట్ రూపకల్పన చేయవలసిందిగా సూచించారు. త్వరితగతిన బడ్జెట్ తయారీ ప్రక్రియ పూర్తయితే మార్చి మొదటి వారం లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఆచితూచి వ్యవహరించనున్నట్లుగా సమాచారం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications