గద్దర్ పార్థీవదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్, కుటుంబసభ్యులకు ఓదార్పు
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి సోమవారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించి సీఎం కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.గద్దర్ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనుకున్న అనుబంధాన్ని స్మరించుకున్న సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, చంటి క్రాంతి కిరణ్, మైనంపల్లి హన్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు.

అంతకుముందు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గద్దర్ పార్థీవదేహానికి నివాళుతర్పించారు. విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, అలీ, ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తదితరులు నివాళులర్పించారు.
కాగా, గద్దర్ ఆదివారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు శోకంద్రంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం వరకు గద్దర్ పార్తీవ దేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచడంతో ప్రజలతోపాటు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత గద్దర్ పార్థీవదేహాన్ని ఆయన ఇంటికి తరలించారు.
ఆయన నివాసంలో కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత సోమవారం సాయంత్రం అల్వాల్‌లోని మహాబోధి స్కూల్‌కు తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి చూపు కోసం వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications