ఆ విద్యార్దులకు నెలకు రూ.2 వేలు స్టయిఫండ్ - రేవంత్..!!

ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యా న్ని అందించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదని చెప్పుకొచ్చారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు చేయూతను అందించడం కోసమే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి ప్రారంభిస్తున్నామన్నారు. ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2000 రూపాయల స్టయిఫండ్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలోని యువతీ యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. మల్లెపల్లిలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రారంభోత్సవంలో రేవంత్ కీలక అంశాలను ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించారని గుర్తుచేశారు.

CM Revanth announces govt planning for Scholarships to the ATC students here the details

ఏటీసీల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగావకాశాలు, పాస్‌పోర్టు తదితర సర్వీసులు అందించడానికి ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడంతో పాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను పొందడానికి సహాయం చేస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

తాము అధికారంలోకి వచ్చాక ఐటీఐలను పునరుద్ధరించాలనే ఆలోచన చేశామని వివరించారు. ఇవాళ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇవాళ ప్రారంభించుకు 65 ఏటీసీలే నిదర్శనమని ఉద్ఘాటించారు. తెలంగాణలో 65 ఏటీసీలను పూర్తి చేశామని తెలిపారు. నేడు మరో 51 ఏటీసీలను మంజూరు చేశామని అన్నారు. ఏడాదిలోగా 51 ఏటీసీల నిర్మాణం పూర్తి చేస్తామని నొక్కిచెప్పారు. సాంకేతిక నైపుణ్యంపై యువత ఫోకస్ పెట్టాలని సూచించారు.

CM Revanth announces govt planning for Scholarships to the ATC students here the details

జపాన్ వంటి ‌ దేశాలు కూడా మన ముందు మోకరిల్లే రోజు వస్తుందన్నారు. చదువు ఒక్కటే విద్యార్ధుల తల రాతను మారుస్తుందన్నారు. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2 వేలు స్కాలర్‌షిప్ అందించేలా ఆర్థికమంత్రిని ఒప్పిస్తామని చెప్పిన రేవంత్. ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్‌ బాబు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. యువత భవిష్యత్ కోసం మేము ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+