బల్లులు,పురుగుల మధ్య 16 రోజులు గడిపా- ఆ నాటి జైలు జీవితంపై సీఎం రేవంత్..!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం అప్పులపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన మాటలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ హయాంలో 41వేల కోట్లు అప్పులు చేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేసిందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కేటీఆర్ అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి

డ్రోన్ ఎగురవేస్తే రూ.500 ఫైన్ విధిస్తారు...
ఒక జర్నలిస్టు ఎవరో కేటీఆర్ ఫాంహౌజ్ పై డ్రోన్ ఎగురవేసి అక్కడి సమాచారం తనకు అందించాడని..దాన్ని మీడియా ద్వారా బయటపెట్టినందుకు ఎంపీగా ఉన్న తనను డిటెన్షన్ సెల్‌లో నిర్భంధించారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. సాధారణంగా అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 జరిమానా విధిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక గత కేసీఆర్ ప్రభుత్వం తనపట్ల వ్యవహరించిన తీరు అంతా ఇంతా కాదని చాలా అన్యాయంగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. తన బిడ్డ పెళ్లికి లగ్నపత్రిక రాసుకుంటుండుగా తనను బెయిల్‌ పై విడుదల చేయాలని కోరగా... బెయిల్ రాకుండా నాడు అడ్డుకున్నారని గుర్తుచేశారు. చివరకు బెయిల్ పై విడుదలై తన బిడ్డ పెళ్లికి హాజరై తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లినట్లు రేవంత్ రెడ్డి సభలో చెప్పారు.

cm-revanth-counters-ktr-over-vendetta-politics-says-he-was-detained-for-16-days-for-no-reason

బల్లుల మధ్య పడుకున్న..
తాను ఇప్పుడు సీఎం అని తను అనుకుంటే కేసీఆర్ కుటుంబం ఎవరూ కూడా బయట ఉండరని అంతా జైలులో కూర్చుంటారని అన్నారు. తను ఎంపీగా ఉన్న సమయంలో డ్రోన్ కేసులో అన్యాయంగా అరెస్టు చేసి 16 రోజుల పాటు డిటెన్షన్ సెల్‌లో నిర్భంధించారని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. అదొక చిన్న సెల్ అని మొత్తం చీకటిగా ఉంటుందని చెప్పిన రేవంత్.. పడుకునేందుకు మూడున్నర అడుగుల దిమ్మె ఉంటుందని అంందులోనే ఒక చిన్న బాత్రూం ఉంటుందని అన్నారు. అదికూడా బయటకు కనపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఒక చిన్న గదిలో ఉంచారని రాత్రి వేళల్లో నిద్రకు ఉపక్రమిద్దాం అనుకుంటే లైట్లు కట్టేసేవారు కాదని చెప్పారు. ఆ లైటు వెళుతురుకు నిద్రవచ్చేది కాదని.. లైట్లు ఉన్నప్పుడు పురుగులు తిరిగేవని వాటిని తినేందుకు బల్లులు తిరిగేవని చెప్పిన రేవంత్ రెడ్డి.. నిద్ర ఎలా పడుతుందని అన్నారు. రాత్రులు మేల్కొని ఉండేవాడినని, కునుకు తీస్తే బల్లులు ఎక్కడొస్తాయో అని ఆందోళన ఉండేదని రేవంత్ అన్నారు.

నేను కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే..
లైట్లను ఆర్పమని బయట కానిస్టేబుల్‌ను అడిగితే లైట్లు కట్టేయవద్దని తమకు పై నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పేవాడని రేవంత్ సభకు చెప్పారు. తాను ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలిచ్చానని అందులో జైలులో కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇళ్లులు కట్టిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ హామీని ఇంకా నెరవేర్చలేదని చెప్పారు. తను కక్ష రాజకీయాలు చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. తాము పదేళ్లలో చేయని పనులను తాము అధికారంలోకి రాగానే చేశామని అందుకే కడుపు మంటతో మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు.కక్షసాధింపుతో వ్యవహరించి ఉంటే కేసీఆర్ కుటుంబం అంతా చంచల్‌గుడ జైల్‌లో ఉంటారని చెప్పారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన నాడే చావు తప్పి కన్నులొట్ట పోయిందని చెబుతూ కేసీఆర్ జారి కింద పడ్డ ఘటనను సీఎం రేవంత్ పరోక్షంగా గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+