రైతు భరోసా అమలు ముహూర్తం ప్రకటించిన రేవంత్..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణలో రైతు భరోసా పైన చర్చ జరుగుతున్న వేళ ఈ పథకం ఎప్పుడు అమలు చేసేదీ క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారంటీల అమలు పైన క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ పైన రేవంత్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ నేతలు తన పైన చేస్తున్న విమర్శలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్ కు సవాల్ : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టీపీసీసీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కార్యకర్తల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు. రాహుల్ జోడో యాత్రతో మూడు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం ఏర్పడి ఇంకా 50 రోజులు కాలేదన్నారు. కానీ, తమ పాలనలో ఏమీ చేయలేని వారరు ఇప్పుడు ప్రభుత్వం దుష్ప్రచారం ప్రారంభించారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని గత పాలకులు తీసుకొచ్చారని విమర్శించారు. సోనియా, రాహుల్ ను వేధించేందుకే ప్రధాని మోదీ ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని రేవంత్ ఆరోపించారు.

CM Revanth Crucial Announcement on Rythu Bharosa and pending Guarantee Schemes implementation

అవును మేస్త్రీనే : రేవంత్ ను గుంపు మేస్త్రీ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పైన రేవంత్ స్పందించారు. మేస్త్రినే అని, మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రినంటూ బీఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు. మిమ్మల్ని ఘోరీ కట్టే మేస్త్రిని కూడా తానేనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి ప్రణాళికా బద్దంగా నియోజకవర్గాల్లో పర్యటనలు ఉంటాయని వెల్లడించారు. ఈ నెలలోనే తాను ఇంద్రవల్లి వస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. కాస్కోవాలని సవాల్ చేసారు. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు కేసీఆర్ రాజ్యసభ సభ్యులను చేశారని.. రూ. 50 వేలు కూడా లేకున్నా 52 వేల మెజార్టీతో గెలుపొందిన మందుల శామ్యూల్‌కి తాము టికెట్ ఇచ్చామని ఆయన చెప్పారు.

CM Revanth Crucial Announcement on Rythu Bharosa and pending Guarantee Schemes implementation

వచ్చే నెల అమలు చేస్తాం : ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసామని చెప్పారు. వచ్చే నెల తొలి వారంలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ ప్రకటించారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ హామీ అమలు దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మరో నిర్ణయం పైన కసరత్తు జరుగుతోంది. ఇక, బ్రవరి చివరి వరకు రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో నగదు వేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను ముఖ్యమంత్రినయ్యానని పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో..ఈ లోగానే గ్యారంటీల అమలు పైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+