సీఎం రేవంత్ ప్రతిపాదనకు కేటీఆర్ మద్దతు..!!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు తెలంగాణ శాసన సభ సంతాపం తెలిపింది. ప్రత్యేకంగా జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ దివంగత ప్రధాని మన్మోహన్ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. మన్మోహన్‌ సింగ్‌ చేసిన సేవలను సీఎం రేవంత్‌ గుర్తుచేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల రూపకల్పి మన్మోహన్‌ సింగ్‌ అని కొనియాడారు. భారతరత్న ఇచ్చి గౌరవించాలని రేవంత్‌ డిమాం డ్ చేసారు. సీఎం రేవంత్ ప్రతిపాదించిన తీర్మానానికి కేటీఆర్ సహా ఇతర పక్షాలు మద్దతు ప్రకటిం చాయి. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ విగ్రహం ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు.

భారత రత్న ఇవ్వాలి
దివంగత ప్రధాని మన్మోహన్ కు నివాళి అర్పిస్తూ.. సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రత్యేకంగా తీర్మానం ప్రతిపాదించారు. అందులో మన్మోహన్ సేవలను కొనియాడారు. మన్మోహన్‌ సింగ్‌ దేశానికి విశిష్ట సేవలందించారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం డిప్ యూటీ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా సేవలందించారని పేర్కొన్నారు. ప్రధానిగా పదేళ్లు అద్భుతమైన పాలన అందించారని కీర్తించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటుగా రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్‌ ఆత్మబంధువని ... తెలంగాణతో ఆయన బంధం విడదీయరానిదని రేవంత్ కొనియాడారు.

CM Revanth Demands Bharat Ratna for Manmohan Singh KTR supports CM Resolution

కేటీఆర్ మద్దతు
తెలంగాణ కు రాష్ట్ర హోదా కల్పించిన మానవతావాదిగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గుండె ల్లో మన్మోహన్‌ స్థానం శాశ్వతమని చెప్పుకొచ్చారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలిని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. తెలంగాణలో మన్మోహన్‌ను విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు. మన్మోహన్ పైన రేవంత్ ప్రతిపాదించిన తీర్మానం కు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. మన్మోహన్‌ సింగ్‌ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. మన్మోహన్‌ సింగ్‌ హాయాంలోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కేంద్రంలో ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్‌ సింగ్‌ను కేసీఆర్‌ కోరారని గుర్తుచేశారు.

మన్మోహన్ విగ్రహం
కేవలం 15 రోజులు ఫారెక్స్‌ నిల్వలు ఉన్న నాటి రోజు నుంచి ప్రపంచమంతా ఆశ్యపడే స్థాయికి దేశాన్ని పరుగెత్తించిన ఆర్థిక సంస్కరణల శీలి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అని కేటీఆర్ పేర్కొన్నారు. అనవసరపు డాంభికాలు, ఆర్భాటాలు, హడావుడి లేకుండా సింపుల్‌ లివింగ్‌.. హై థింకింగ్‌ అనే మాటకు పర్యాయపదంగా మన్మోహన్‌ సింగ్‌ను మనం చెప్పుకోవచ్చని చెప్పారు. బీజేపీ, సీపీఐ నేతలు సైతం ప్రసంగించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు సభలో రేవంత్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి దేశంలో మన్మోహన్ తీసుకొచ్చిన చట్టాలను సభ లో ప్రస్తావించారు. ఆర్దిక సంస్కరణలతో దేశానికి కొత్త భవిష్యత్ ఇచ్చారని కీర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+