స్పీకర్ కంటతడి - కేసీఆర్ ను ఫిక్స్ చేసిన రేవంత్, అనూహ్య డిమాండ్..!!

అసెంబ్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యల పైన కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సీఎం రేవంత్ సైతం సీరియస్ అయ్యారు. ఆ సభ్యుడి పైన బహిష్కరణ వేటు వేయాలని డిమాండ్ చేసారు. స్పీకర్ సభలోనే ఉద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. ఈ వివాదంలో కేసీఆర్ ను ఫిక్స్ చేసిన సీఎం రేవంత్.. అనూహ్య డిమాండ్ చేసారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేస్తూ సభకు చేరుకునే ప్రయత్నం చేసారు. పోలీసులు అడ్డుకోవటం తో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. చీకటి మిత్రులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో చర్చలు జరిగిన తర్వాతే నిర్ణయాలు జరుగుతాయని.. నిర్ణయాలు జరిగిన తర్వాత చర్చలు జరగవని స్పష్టం చేశారు.

CM revanth demands serious action against BRS MLC Tata Madhu over his abusing comments on Speaker

అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపైనా చర్చ జరుగుతుందన్నారు. స్పీకర్‌ చైర్‌ను అవమానిస్తే స్పందించాల్సిన అవసరం బీజేపీకి లేదా అని ప్రశ్నించారు. సభ్యుల హక్కులను కాపాడే స్పీకర్‌ను అవమానించారని మండిపడ్డారు. దూషించాలని కేసీఆరే పురిగొల్పి పంపించా రని ఆరోపించారు. సభ్య సమాజం సహించలేని భాష మాట్లాడారంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ మధు పై వేటు కు రంగం సిద్దం

ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవానికే గాయమైందని.. స్పీకర్‌పై అత్యంత అసభ్యకరంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక దళిత వ్యక్తిని సీఎం చేస్తానని, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్‌ చేసిన ఘనత కేసీఆర్‌ది అంటూ వ్యాఖ్యానించారు. దళిత వ్యక్తిని ప్రతిపక్ష నేతగా చూడలేకపోతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక ఆలోచనను సరిదిద్దకపోతే భవిష్యత్‌ తరాలు ఈ సభను క్షమించవన్నారు.

ఈ రకమైన అవమానం ఎప్పుడూ, ఎక్కడా జరగలేదని వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. స్పీకర్‌ చైర్‌ను అభ్యంతరకర భాష మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధును బీఆర్‌ఎస్ డిస్మిస్‌ చేయాలన్నారు. తాతా మధుతో రాజీనామా చేయించాలని.. లేకపోతే బర్తరఫ్‌ చేయాలన్నారు. తాము ఏం మాట్లాడినా వెనుక కేసీఆర్ ఉన్నారని బీఆర్‌ఎస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+