తేల్చేసిన హైమాండ్, రేవంత్ కు బిగ్ టాస్క్ - మంత్రులకు పరీక్ష..!!
తెలంగాణ కేంద్రంగా రాజకీయ ఆసక్తి కరంగా మారింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మీడియా సంస్థల కేంద్రంగా మంత్రులు లక్ష్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాల పై రేవంత్ సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రాజకీయంగా బిగ్ టాస్క్ ఎదుర్కొనేందుకు సిద్దమయ్యారు. ఇందులో మంత్రులను భాగస్వాములను చేస్తున్నారు. మంత్రుల సమర్థతకు పరీక్ష పెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్ష మంత్రుల రాజకీయ భవిష్యత్ కు కీలకంగా మారుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు నిర్ణయించారు. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు మునిసిపల్ కార్పొరేషన్లు, 2,996 వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయినందున.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా రెండు రోజుల క్రితం రిజర్వేషన్లు ఖరారు చేశారు.

ఫిబ్రవరి 15న శివరాత్రి, ఆ మరుసటి రోజు రంజాన్ పండుగ, తదనంతరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నందున.. వీలైనంత తొందరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. కాగా, మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ మంత్రుల సమర్థతకు పరీక్ష పెడుతూ కీలక నిర్ణయం వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రులను పార్లమెంటరీ జిల్లాల వారీగా ఇంఛార్జ్ బాధ్యతలను కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ సీటు గెలవాల్సిందేనని సీఎం తేల్చి చెబుతున్నారు. హైకమాండ్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో.. మంత్రులకు కేటాయించిన జిల్లాల్లో ఫలితాలే వారి మంత్రి పదవి కొనసాగింపుకు కొలమానంగా సంకేతాలు ఇస్తున్నారు.
ఆదిలాబాద్ - సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్కాజ్‌గిరి - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల - శ్రీధర్‌బాబు, మెదక్ - వివేక్, కరీంనగర్ - తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి - జూపల్లి కృష్ణారావు, నల్గొండ - అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి - సీతక్క, వరంగల్ - పొంగులేటి, మహబూబ్‌నగర్ - పొన్నం ప్రభాకర్, మహబూబ్‌నగర్ - దామోదర రాజనర్సింహా, జహీరాబాద్ - అజహరుద్దీన్, నాగర్‌కర్నూల్ - వాకిటి శ్రీహరి, ఖమ్మం - కొండా సురేఖకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటం... ఈ ఫలితాలు తమ మంత్రి పదవికి పరీక్షగా మారటంతో మంత్రుల్లో ఉత్కంఠ మొదలైంది. దీంతో.. మున్సిపల్ ఎన్నికలు కేంద్రంగా చోటు చేసుకొనే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications