జూబ్లీహిల్స్ బై పోల్ లో ఆ మూడు పార్టీలు కలిసి పోటీ, ఇక - రేవంత్..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. జూబ్లీహిల్స్ బై పోల్ ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే సైతం జూబ్లీహిల్స్ బై పోల్ లో గెలిచి తీరాలని నిర్దేశించారు. అటు టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్ధిని బరిలోకి దించుతుందని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో రేవంత్ మూడు పార్టీలు కలిసి జూబ్లీహిల్స్ లో పోటీకి దిగుతున్నాయని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
దిశా నిర్దేశం
ఏఐసీసీ చీఫ్ ఖర్గే జూబ్లీహిల్స్ బై పోల్ పైన ఆరా తీసారు. బై పోల్ లో పోటీ చేయాలని.. గెలవాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఉప ఎన్నికలో మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు దిగుతాయిని చెప్పు కొచ్చారు. ఉప ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. ఇన్‌చార్జీ మంత్రులు ప్రతి అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉండాలని సూచించారు. పార్టీ పదవులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. పార్టీ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉండాలని అన్నారు.

మూడు పార్టీలు కలిసి
టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం లో రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ప్రస్తావన చేసారు. రేవంత్ చెప్పిన మూడు పార్టీల గురించి పార్టీలో చర్చ జరుగుతోంది. అటు బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీకి సమాయత్తం అవుతోంది. కాగా.. ఏపీలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ఇక్కడ ఈ బై పోల్ ద్వారా కొత్త ప్రయోగం చేసేందుకు సిద్దం అవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక, పార్టీ పదవులు భర్తీ చేయడంలో టీపీసీసీ చీఫ్ ఎందుకు జాప్యం చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నేషనల్ నరేటివ్ బిల్డప్ చేసుకోవాలని సూచించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీ సీట్లు పెంపు
దేశంలోనే అన్నిరాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్గాటించారు. కేంద్రప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని వ్యాఖ్యానించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామని చెప్పుకొచ్చారు. పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పార్టీ పదవులతోనే నేతలకు గుర్తింపు, గౌరవమని స్పష్టం చేసారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరుగబోతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతు న్నాయని చెప్పుకొచ్చారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని సూచించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications