కౌశిక్ vs గాంధీ రచ్చ, మరో మలుపు - రేవంత్ ఆదేశాలు..!!
ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి..గాంధీ సవాళ్ల వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది. ఇంకా సవాళ్లు కొనసాగుతున్నాయి. కౌశిక్ ఇంటిపై గాంధీ మద్దతుదారుల దాడితో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ నేతలు సీపీ కార్యాలయం వద్ద ధర్నా..అరెస్ట్ తో వివాదం పెరిగింది. ఆ తరువాత వారిని విడుదల చేసారు. ఈ వ్యవహారం పైన రేవంత్ సీరియస్ అయ్యారు. డీజీపీకి తాజాగా ఆదేశాలు ఇచ్చారు.
రచ్చ రచ్చ
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేవారు. 132, 351 (3) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు నమోదు చేశారు.

కొనసాగుతున్న ఉద్రిక్తత
ఈ ఇద్దరి సవాళ్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాలకు కొనసాగింపుగా కౌశిక్ రెడ్డి తాజాగా మరో సవాల్ చేసారు. ఇదే సమయంలో శుక్రవారం చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది. చలో గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం 11గంటలకు మల్లంపేటలోని శంభిపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. దీంతో, పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు.
సీఎం రేవంత్ ఆదేశాలు
పీఏసీ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా గాంధీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు ఆయన నివాసంలో మేడ్చల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు శంబిపూర్ రాజు ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరుకావాలని మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులను ఆహ్వానించారు. తాజా పరిణామాల పై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. డీజీపీకి తాజాగా ఆదేశాలు ఇచ్చారు. రాజకీయ కుట్రలు సహించేది లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా బీఆర్ఎస్ యత్నం చేస్తుందని మండిపడ్డారు. శాంతి భద్రతల పై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications