తిరుమలలో మొక్కులు చెల్లించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. చివరి మూడు రోజుల్లో భక్తులు శ్రీవారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న భక్తుల సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

ఈ రద్దీ మంగళవారం కూడా కొనసాగింది. మొత్తంగా 80,744 మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వారిలో 35,726 మంది తల నీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 3.67 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పట్టింది.

CM Revanth Reddy along with his family members visits Tirumala Sri Venkateswara Temple

కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడమే కాకుండా క్యూ లైన్లల్లో బారుల తీరి నిల్చున్నారు భక్తులు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. ఎండ వేడికి గురి కాకుండా చలువ పందిళ్లను వేశారు.

తాజాగా- తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రే ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు.

రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి, కుమార్తె నిమిష, అల్లుడు సత్యనారాయణ, మనవడితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారాయన. ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు, అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో గల రంగనాయకుల వారి మండపంలో ఆశీర్వచనాలు పలికారు. తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, శేషవస్త్రాన్ని అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+