భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యాన్ని సహించం: సీఎం రేవంత్

భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. భూ భారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు.

"జిల్లాలోని ప్రతి మండలంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందే. చట్టంపై ప్రజలకు సరళంగా వివరించాలి. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేయాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలి. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆమోదం తరువాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలి" అని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో తెలిపారు.

CM Revanth Reddy Concludes Key Meeting with District Collectors

అంతేకాక తాగునీటి సరఫరా విషయంలో జిల్లాల్లో వేసవి యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించాలన్నారు. ఎక్కడా తాగు నీటి సమస్య రాకూడదని, ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుంటూ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+