డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వార్ ఫిక్స్ చేసిన రేవంత్... నేడు అసెంబ్లీలో తీర్మానం!

దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది .డీలిమిటేషన్ కమిషన్ నిర్వహించే లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి బిజెపియేతర పార్టీల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాల పైన తీవ్రంగా పడుతుందని దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందని పలువురు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డీలిమిటేషన్ రగడ .. ప్రతిపక్షాలా డిమాండ్
తాజాగా తమిళనాడు రాష్ట్రంలో డీలిమిటేషన్ కు సంబంధించి జరిగిన జేఏసీ మీటింగ్లో తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు పాల్గొని డీలిమిటేషన్ పైన తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల పాటు దీనిని మార్చడానికి వీలు లేదంటూ ప్రధానంగా తమ డిమాండ్ ను వినిపించారు.

CM Revanth reddy fixed war against delimitation Resolution in the Assembly today

డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి స్టాండ్ ఇదే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డిలిమిటేషన్ పైన తమ నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ద్వారా లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కోల్పోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ప్రస్తుతం ఉన్న 24 శాతం నుండి 33% కి పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో అసమానతలను సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నం గా దీనిని ఆయన అభివర్ణించారు.

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తీర్మానం
అన్యాయమైన సరిహద్దుల విభజనను అమలు చేయకుండా బీజేపీని ఆపాలని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో మరో మారు హైదరాబాద్ వేదికగా జేఏసీ సమావేశాన్ని నిర్వహించడానికి రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా డీలిమిటేషన్ కు సంబంధించి రేవంత్ రెడ్డి శరవేగంగా దూకుడునిర్ణయాన్ని తీసుకున్నారు.చెన్నైలో జరిగిన భేటీ తర్వాత సీఎం రేవంత్ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు.

శాసనసభలో డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ తీర్మానం
ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టి దీనిపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దీనిని కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్న వేళ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాదికి నష్టం చేసి ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువగా మారిన వేళ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి డీలిమిటేషన్ పైన తమ బలమైన స్టాండ్ ను కేంద్రానికి తెలియజేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+