ఆ సక్సెస్ తో సంతోషంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇక ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తోంది. రైతులకు రుణమాఫీ అందిస్తుంది. గృహ జ్యోతి పథకం ద్వారా పేదల ఇంట విద్యుత్ వెలుగులను పంచుతోంది. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లు అందిస్తుంది.

ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలను ఇస్తుందన్న రేవంత్ రెడ్డి
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాము అందిస్తున్న పథకాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్దిపైన సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు తీరును ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. నిరుపేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలను ఇస్తుందని రేవంత్ రెడ్డి ఆ పోస్టులో పేర్కొన్నారు.

CM Revanth reddy happy with the success of gruhajyothi scheme implementation in telangana

హైదరాబాద్ లోనే పది లక్షల 52 వేల కుటుంబాలకు లబ్ది
తెలంగాణ రాష్ట్రం సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని, గృహ జ్యోతిలో ఈ డిసెంబర్ నెలతో సున్నా బిల్లుల సంఖ్య కోటికి చేరుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే పది లక్షల 52 వేల కుటుంబాలు గృహజ్యోతి పథకం కింద ప్రయోజనం పొందుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

గృహ జ్యోతి పథకం అమలుపై రేవంత్ రెడ్డి హర్షం
ఇది హర్షించదగ్గ విషయమని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇదిలా ఉంటే పేదల పైన కరెంటు బిల్లుల భారం తప్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ ను వినియోగించే కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంటును అందిస్తోంది.

ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి ట్వీట్
దీంతో ఆయా కుటుంబాలకు కరెంటు బిల్లులను చెల్లించాల్సిన బాధ తప్పింది. ఇక ఈ క్రమంలోనే గృహ జ్యోతి పథకం సక్సెస్ పైన రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి తన సంతోషాన్ని తెలియజేశారు. తెలంగాణాలో సంక్షేమ పథకాల అమలు తీరుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+