Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుకు సంకెళ్లా?: సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్

రైతుకు సంకెళ్లు వేసిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్‌కు సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతినొప్పి వచ్చింది. దీంతో జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ సందర్భంగా రైతు చేతులకు పోలీసులు బేడీలు వేయడం గమనార్హం. ఈ విషయం రేవంత్ రెడ్డికి దృష్టికి రావడంతో సీరియస్ అయ్యారు.

అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు.

CM Revanth Reddy is serious about the incident of fetters being placed on a farmer

అంతేగాక, హీర్యానాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కాగా, రైతు హీర్యానాయక్‌కు ఛాతినొప్పి రావడంతో మొదట సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం హీర్యానాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తెలిపారు. హార్ట్ బీట్ కొంచెం తక్కువగా ఉందన్నారు.

గతంలో కూడా తనకు గుండె నొప్పి వచ్చిందని హీర్యానాయక్ చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట నిమ్స్‌కు రిఫర్ చేశామని ఆయన తెలిపారు. దీంతో నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో హీర్యా నాయక్ కు చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలావుండగా, రైతుకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

రైతుకు గుండెనొప్పి వస్తే బేడీలు వేసి ఆస్పత్రికి తరలించడం క్షమార్హం కాదని కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతులను కస్టడీలో చిత్రహింసలు పెట్టారని మెజిస్ట్రేట్ ముందు చెబితే... కుటుంబసభ్యులను కూడా కొడతామని బెదిరించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట వినకపోవడమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేస్తారా? అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు హీర్యానాయక్ ఏమైనా ఉగ్రవాదా? దోపిడీ దొంగా? అని ప్రశ్నించారు. రైతుల భూములు లాక్కుంటారని.. తిరగబడితే అరెస్టు చేస్తారని ధ్వజమెత్తారు. అనారోగ్యంతో ఉన్న రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లడం హేయమైన చర్య అని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+