టార్గెట్.. కారు, కమలం: రేవంత్ ద్విముఖ వ్యూహాలు

అధికార కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. బీసీ రిజర్వేషన్లు, ఓట్ చోరీపై ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన రేవంత్ రెడ్డి బీహార్ కు వెళ్లనున్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్వహించ తలపెట్టిన ఓట్ చోరీ పాదయాత్రలో పాల్గొననున్నారు.

రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రివర్గంలో తీర్మానాన్ని ఆమోదించామని, అసెంబ్లీలో బిల్ సైతం పాస్ చేసుకున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చామని అన్నారు.

CM Revanth Reddy made key remarks in Congress PAC meeting

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ గతంలో చట్టం తెచ్చారని, ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి తెచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ కేంద్రానికి పంపారని చెప్పారు. బీసీలకు అన్ని రంగాల్లో, అన్ని రకాలుగా మేలు జరగాల్సిందేనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో ఎదురవుతున్న అడ్డంకులను న్యాయ ప్రక్రియ ద్వారా తొలగించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతామని అన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ మాట నిలబడాలని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీ లకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదని రేవంత్ స్పష్టం చేశారు. 90 రోజుల్లో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశంపై సుప్రీంకోర్టు లో రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించామని పేర్కొన్నారు.

అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుందని అన్నారు. విడిగా సుప్రీంకోర్టుకు వెళ్తే పిటీషన్ లిస్టింగ్ కు రావడానికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్రకు ఈ నెల 26వ తేదీన హాజరవుతున్నానని రేవంత్ చెప్పారు.

బీఆర్ ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయని, యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటిఆర్ చెప్పడం లోనే వాళ్ల తీరు అర్థమౌతోందని చెప్పారు. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్ ను కలిశానని గుర్తు చేశారు.

తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు ధన్యవాదం తెలిపారు. దీనిపై ఓ తీర్మానాన్ని ఆమోదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+