ప్రభుత్వోద్యోగులను గాడిలో పెట్టే పనిలో సీఎం రేవంత్ రెడ్డి.. మాస్ వార్నింగ్!!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. శాఖల వారీగా సమీక్షలు చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడును ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి వివిధ విభాగాలకు సమీక్షలను నిర్వహిస్తూ ఏమాత్రం చిన్న తప్పు దొరికినా వదిలిపెట్టేది లేదనే సంకేతాలను పంపుతున్నారు.
ఇక తాజాగా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సదస్సులో కూడా రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజలతో శభాష్ అనిపించుకున్నంతవరకే ప్రభుత్వం అధికారులతో స్నేహపూర్వకంగా ఉంటుందని, కాదని నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేస్తే ఏ అధికారినైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.

రేవంత్ రెడ్డి వివిధ ప్రభుత్వ విభాగాల పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి సమావేశాలు నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో కీలకంగా వ్యవహరించాల్సిన జిల్లా కలెక్టర్లు, శాంతిభద్రతలను పరిరక్షించవలసిన పోలీస్ విభాగాల పైన దృష్టి సారించిన ఆయన ఇటీవల జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో సదస్సు నిర్వహించారు.
ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి పౌరులతో గౌరవంగా ఉండాలి కానీ క్రిమినల్స్ తో కాదంటూ పేర్కొన్నారు. గంజాయి , డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరాన్ని ఆయన తేల్చి చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో నేరాలు, హత్యలు చేసిన వారితో ఫ్రెండ్లీగా ఉండొద్దని రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్లు కూడా జవాబుదారీతనంతో వ్యవహరించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
విధినిర్వహణలో ఐఏఎస్ అధికారులు ఉత్తమంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అలాకాకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికార యంత్రాంగాన్ని గాడిలో పెడితే క్షేత్రస్థాయిలో పని సక్రమంగా జరుగుతుందని భావించిన రేవంత్ రెడ్డి, ఈ క్రమంలోనే పాలనా పగ్గాలు చేపట్టిన తొలి నాటి నుండే అధికార యంత్రాంగానికి మాస్ వార్నింగ్ ఇస్తూ ముందుకు వెళుతున్నారు. మరి రేవంత్ ప్రయత్నం ఏమేరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications