సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో భూగర్భ విద్యుత్ లైన్లు..!
వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలని తెలిపారు. ఈ మేరకు విద్యుత్ శాఖపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పరిస్థితిపై సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు.
ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 'గత ఏడాదితో పోల్చితే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది. 2025- 26లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుంది. 2034-35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుంది. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నాం' అని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. "వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. రైల్వే లైన్లు, మెట్రో , ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాల ను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త గా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి" అని సీఎం రేవంత్ అధికారులతో పేర్కొన్నారు.
"భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్ గా మారబోతుంది. హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలి" అని సీఎం రేవంత్ ఆదేశించారు.

"విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలి. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదు. హై టెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలి. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలి. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలా ల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి" అని సీఎం రేవంత్ అధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు.












Click it and Unblock the Notifications