స్పోర్ట్స్ పాలసీతో ప్రపంచంతో పోటీ - సీఎం రేవంత్
ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకు వస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాదులోని హెచ్ఐసీసీలో నిర్వహించిన "ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ-2025 "ను అధికారికంగా విడుదల చేశారు. క్రీడలను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్ 2047..
తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్‌లో స్పోర్ట్స్ పాలసీకి ప్రత్యేక అధ్యాయంగా స్థానం ఇచ్చామన్నామని సీఎం పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ తెలంగాణ యువత రాణించాలని కోరారు. ప్రపంచస్థాయిలో పోటీ పడేందుకు సమర్థవంతమైన విధానాలను తీసుకొచ్చామన్నారు. క్రీడా విధానంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి.. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ను ప్రోత్సహించడం తమ ప్రధాన లక్ష్యమన్నారు.

అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం పలు అంతర్జాతీయ క్రీడా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. ముఖ్యంగా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, ట్రైనింగ్ శిబిరాలు, టాలెంట్ స్కౌటింగ్, స్పోర్ట్స్ సైన్స్ సపోర్ట్, ఫిట్‌నెస్ ల్యాబ్స్ వంటి అంశాల్లో విదేశీ నిపుణుల భాగస్వామ్యం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
క్రీడా మైదానాల వినియోగం విషయంలో కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పలు మైదానాలు ఇప్పుడు పెళ్లిళ్లు, ఈవెంట్ల కోసం వాడుతున్నారని మండిపడ్డారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే విషయమని.. ఇకపై క్రీడా మైదానాలను క్రీడల కోసమే వినియోగించాలని అన్నారు.
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the 1st Edition of the Telangana Sports Conclave at HICC, Hyderabad. https://t.co/3vSrM1jSLk
— Telangana CMO (@TelanganaCMO) August 2, 2025
ప్రభుత్వం సరైన దిశలో క్రీడా అవకాశాలను కల్పించకపోతే.. యువత మాదక ద్రవ్యాల బానిసలవుతారని హెచ్చరించారు. క్రీడలు అంటే కేవలం ఫిజికల్ యాక్టివిటీ కాదని.. అది జీవిత శైలిని మారుస్తుందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి ప్రకటనతో.. తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటుకు ముందడుగు పడింది. పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్) విధానాన్ని అనుసరించనున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించిన వారు, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో అనుభవం ఉన్నవారితో కలిసి ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేశారు.
తెలంగాణ నుంచి ఇప్పటికే అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తీ శర్మ, రవితాం లాంటి క్రీడాకారులు దేశానికి గర్వకారణంగా నిలిచారని సీఎం గుర్తు చేశారు. వీరి తరహాలో మరిన్ని ప్రతిభలు వెలుగులోకి రావాలంటే రాష్ట్రం సరైన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 2026లో జరిగే ఖేలో ఇండియా గేమ్స్ను తెలంగాణలో నిర్వహించేందుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియాతో మాట్లాడినట్టు సీఎం వెల్లడించారు.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
తెలంగాణ డిస్కంలకు సింగరేణి ఊహించని షాక్.. రాజస్థాన్ కు కరెంట్ విక్రయం! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
తెలంగాణాలో ఆ గ్రామానికి గ్యాస్ చింతే లేదు.. ఎందుకంటే! -
ఇల్లు కట్టే వారికి బంపర్ ఆఫర్: కొత్త బిల్డింగ్ రూల్స్ ఇవే.. -
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం: పైలెట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్! -
కొండెక్కి కూర్చున్న కోడి ధరలు.. కొనలేమంటున్న సామాన్యులు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ












Click it and Unblock the Notifications