ఒకే వేదికపై సీఎం సహా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు! రేవంత్ పిలుపు
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంది. ఎప్పుడూ రాజకీయంగా విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు ఎలాంటి తారతమ్యం లేకుండా ఒకే వేదికపైకి వచ్చారు. అంతేగాక, ఒకరిపై ఒకరు సానుకూలమైన వ్యాఖ్యలు చేసుకుంటూ జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అదే బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు రచించిన 'ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం.
హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు, కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ లక్ష్మణ్, రచయిత అందెశ్రీ, బీఆర్ఎస్ నేత బోయిన్ పల్లివినోద్ తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. సీహెచ్ విద్యాసాగర్ ఆత్మకథ 'ఉనిక' పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని అన్నారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తానని చెప్పారు. గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టుల గురించి అందరికీ తెలుసని.. గోదావరి జలాల సద్వినియోగం కోసం విద్యాసాగర్ రావు అనుభవం రాష్ట్రానికి అవసరమన్నారు. ప్రస్తుతం ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారని.. వారితో మాట్లాడి భూసేకరణ సహకరించాలని రేవంత్ కోరారు.
ఎన్నికలప్పుడే రాజకీయమని.. తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైనే ధ్యాస ఉంటుందన్నారు సీఎం రేవంత్. ప్రతిపక్షం, పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వమని అన్నారు. సభలో పాలక పక్ష నేతకు ఎంత ప్రాధాన్యం ఉండేదో ప్రతిపక్ష నేతకూ అంతే ప్రాధాన్యత ఉండేదని.. అయితే, కాలక్రమేణా స్ఫూర్తిని కోల్పోయామని అన్నారు. సభలో తాము ఇప్పటి వరకు ఒక ప్రతిపక్ష సభ్యుడ్ని కూడా సస్పెండ్ చేయలేదన్నారు.
తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి నిరంతరం కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. మెట్రో, రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణాల విషయాలపై కేంద్రం సహకరించాలని ప్రధానమంత్రి మోడీని కోరాను. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి త్వరగా పరిపూర్ణమవుతుంది. హైదరాబాద్ మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బండి సంజయ్ ఇందు కోసం తనవంతుగా కృషి చేయాలన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, హైదరాబాద్ మెట్రో పొడిగించాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మోడీ మంజూరు చేశారు. పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఏకతాటిగా కలిసి పోరాడుతున్నాయి. మనం ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా, సందర్భానుసారం పార్టీల ఐక్యతను అన్ని పార్టీల నాయకులు ప్రశంసించారు. అనేక పనులు ఉన్నప్పటికీ పుస్తకావిష్కరణకు వచ్చి సమయం కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు.

రేవంత్ ఆలోచన అభినందనీయమన్న విద్యాసాగర్ రావు
తన ఆత్మకథ 'ఉనిక' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. నాయకులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా, జాతీయ భావన ఉంటుందని అన్నారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా భారతీయతను వదులుకోకూడదని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ బౌద్ధమతంలో చేరారని చెప్పారు. శ్రీపాద రావు అప్పట్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశారని, అందుకే ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని బీజేపీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు.
రథయాత్ర సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్నారని అద్వానీని సీనియర్ ఎన్టీఆర్ మెచ్చుకున్నారని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు. ఎన్టీఆర్ తన సినిమాల్లో బీసీ వాదాన్ని చక్కగా తెరకెక్కించారన్నారు. ఇంకా మన దేశంలో ఐదో వంతు పేదరికం ఉందని, దానికి పరిష్కారం చూపాలని అన్నారు.
దేశ యువతలోని శ్రమ శక్తిని బయటకు తీయడమే ఇప్పటి నాయకులకు అసలైన సవాల్‌గా మారిందన్నారు. వారిని ప్రోత్సహించకపోతే గంజాయి, డ్రగ్స్ వంటి దురలవాట్లకు లోనవుతారన్నారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి 'హైడ్రా' ఆలోచన మంచిదని విద్యాసాగర్ రావు కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లో రూ. వేల కోట్ల విలువైన సంపద ఉందని, దాన్ని వెలికి తీసి వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. హైడ్రా తరహాలో గిరిజనుల భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని విద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications