Ration Cards: శుభవార్త చెప్పిన సీఎం రేవంత్.. రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం..!
రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో రేషన్ కార్డుల జారీ తగ్గిపోయింది. దీంతో చాలా మంది పేదవారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. ప్రజాపాలనలో దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు దరఖాస్తులను కూడా స్వీకరించింది. అలాగే ఇంకా రేషన్ కార్డు కావాలనుకునే వారు మీసేవలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
చాలా మంది మీ సేవ ద్వారా కూడా రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నారు. ఫిబ్రవరి చివరకు మీ సేవ ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే వీరికి ఎప్పుడు రేషన్ కార్డులు జారీ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులను వివరణ కోరగా.. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోందని ఇది ముగియగానే కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.

రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి 29 వరకు అవకాశం ఉంది. ఆలోగా రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ చేసుకోకుంటే రేషన్ కార్డు నుంచి పేరు తొలగిస్తామని హెచ్చరించారు. మార్చిలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రేషన్ కార్డుల జారీపై స్పందించారు.
కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియ అని మీడియా చిట్ చాట్ లో రేవంత్ అన్నారు. దీన్ని బట్టి గతంలో ఇచ్చినట్లే రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications