కరెంటు కోతలు ఉండేలా కుట్ర చేశారా?: విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొంది. ముఖ్యమంత్రిగా రేవంత్, పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, విద్యుత్ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధానంగా విద్యుత్ సరఫరా విషయంపై సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది.
విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై రేవంత్ సీరియస్ అయ్యారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. శుక్రవారంలోగా విద్యుత్ అంశంపై పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు. శుక్రవారం ఉదయం విద్యుత్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు.

విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు రూ. 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నతాధికారులు వివరించారు. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని ఆదేశించారు. శుక్రవారం నిర్వహించే సమీక్ష సమావేశానికి ప్రభాకర్ రావును కూడా రప్పించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఎల్లుండి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘంగా కేబినెట్ భేటీలో చర్చించినట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర తొలి కేబినెట్ భేటీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టో అమలు చేయాల్సి ఉందన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలు ప్రజలకు తెలియాలని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు ఆర్థిక వ్యవహారాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ప్రతి పైసా గురించి తెలియాలని.. ఆ మొత్తంలో ఎంత వరకు ప్రజలకు చేరిందనేది కూడా తెలియాలన్నారు.
2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు ఏ శాఖలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు.. దేనికి ఎంత ఖర్చు చేశారు, వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంత వరకు చేరువయ్యాయనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా అన్ని వివరాలతో కూడిన అన్ని అంశాలు తెలియజేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు.
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు హామీలను అమలు చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తామని చెప్పారు. రూ. 10 లక్షల పెంపుతో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ రెండు గ్యారంటీలపై ఆయా శాఖల అధికారులతో శుక్రవారం సీఎం రేవంత్ చర్చిస్తారని ఆయన తెలిపారు. ఇతర హామీల అమలుపైనా కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా సాగుకు 24 గంటల కరెంటు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గత తొమ్మిదేళ్లుగా విద్యుత్ కు సంబంధించిన గత రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదన్నారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పై సమీక్షించామని తెలిపారు.
డిసెంబర్ 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుందన్నారు. ప్రొటెం స్పీకర్ ను గవర్నర్ నియమించిన తర్వాత.. వారి చేతుల మీదుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటుందని మంత్రి తెలిపారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలకు ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు పరిశీలిస్తారన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రూప్-2 అంశంపైనా చర్చించినట్లు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications