నాలుగేళ్ల చిన్నారి కోసం గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్నారి నేతావత్ లిఖితా శ్రీకి అత్యవసరంగా అవసరమైన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను ఉచితంగా అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తోటి చిన్నారులతో కలిసి ఆడుతూ, పాడుతూ ఉండాల్సిన ఈ వయస్సులో.. వినికిడి లోపం అడ్డంకిగా మారింది. ఎవరు ఏం చెబుతున్నారో అర్థం కాక.. తన లోకంలో మౌనంగా ఉండిపోతున్న ఆ చిన్నారి బాధను గుర్తించిన తల్లిదండ్రులు పలువురు వైద్యులను సంప్రదించారు. అయితే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తప్పనిసరి అని చెప్పడంతో.. అంత ఖర్చు పెట్టుకోలేక విషయాన్ని పలువురు విన్నవించుకున్నారు.

cm-revanth-reddy-showed-great-concern-for-four-year-old-child

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ENT ఆసుపత్రిలో తక్షణమే ఉచిత చికిత్స అందించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చిన్నారి పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. అవసరమైన సర్జరీని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. దాంతో సామాన్యుల కష్టాలను గమనిస్తూ.. వారికి వెంటనే సహాయాన్ని అందించడంలో సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవ పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+